సహకార సంఘాల ద్వారా వ్యాపారాలు చేపట్టాలి
బాపట్ల: జిల్లాలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ద్వారా వాణిజ్య కార్యకలాపాల నిర్వహణకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ జె.వెంకట మురళి అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లో జిల్లా స్థాయి కో–ఆపరేటివ్ డెవలప్‌మెంట్ కమిటీ సమావేశం కలెక్టర్ అధ్యక్షతన నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ సంఘాల ద్వారా గిడ్డంగుల నిర్వహణ చేపట్టాలన్నారు. అలాగే పెట్రోల్ బంకులు, ఫెర్టిలైజర్స్, జనరిక్ మందుల షాపులు ఏర్పాటు చేయాలని సూచించారు. సొసైటీల్లో రికార్డుల కంప్యూటరీకరణ పూర్తిచేయాలని చెప్పారు. అనంతరం సహకార సంఘాల పోస్టర్‌ను ఆవిష్కరించారు. సమావేశంలో జిల్లా సహకార అధికారి సి.హెచ్.శ్యాంసన్, వ్యవసాయ శాఖ జేడీ రామకృష్ణ, పశుసంవర్ధకశాఖ జేడీ వేణుగోపాల్, గుంటూరు జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ సీఈఓ ఫణి కుమార్, ప్రకాశం జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ సీఈఓ బిందు తదితరులు పాల్గొన్నారు.
సమర్థంగా ఆధార్‌కార్డుల నవీకరణ
ఆధార్ కార్డుల నవీకరణ ప్రక్రియను జిల్లాలో సమర్థంగా చేపడుతున్నట్టు కలెక్టర్ జె.వెంకట మురళి ఆదేశించారు. ఆధార్ కార్డుల నమోదు, నవీకరణ ప్రక్రియపై జిల్లాస్థాయి కమిటీ సమావేశం బుధవారం కలెక్టరేట్‌లో జరిగింది. కలెక్టర్ మాట్లాడుతూ అధికారులకు పలు ఆదేశాలు జారీ చేశారు. మార్గదర్శకాలను వివరించారు.
మహిళా దినోత్సవాన్ని నిర్వహిద్దాం
అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని బాపట్ల జిల్లాలో వైభవంగా నిర్వహించాలని కలెక్టర్ జె.వెంకట మురళి చెప్పారు. మహిళా దినోత్సవం ఏర్పాట్లపై అనుబంధ శాఖల జిల్లా అధికారులతో బుధవారం కలెక్టరేట్‌లో ఆయన సమీక్షించారు. సమావేశంలో జిల్లా అదనపు ఎస్పీ విఠలేశ్వర్, డీఆర్డీఏ పీడీ పద్మ, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ విజయమ్మ, మోడల్ అధికారి నాగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ జె.వెంకట మురళి
Comments
Please login to add a commentAdd a comment