బాపట్ల : పర్యాటక ప్రాంతంగా బాపట్ల జిల్లాను అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆ దిశగా కృషి చేయాలని పర్యాటక శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి అజయ్ జైన్ జిల్లా కలెక్టర్‌కు సూచించారు. బుధవారం స్థానిక కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో పర్యాటకశాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని తక్కువ సమయంలో మెరుగుపరచడానికి, జీడీపీ వృద్ధి రేటును పెంచడానికి సులువైన మార్గంగా పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని అజయ్ జైన్ తెలిపారు. చీరాలలో చేనేత చీరల తయారీ విధానం గురించి, జీడిపప్పు ప్రాసెసింగ్ గురించి, రొయ్యల ప్రాసెసింగ్ గురించి కేంద్రాలను ఏర్పాటు చేయాలన్నారు.
జిల్లాలో ఆరుబీచ్‌లు : కలెక్టర్
జె.వెంకట మురళి
జిల్లా కలెక్టర్ జె వెంకట మురళి మాట్లాడుతూ, బాపట్ల జిల్లాలో మొత్తం ఆరు బీచ్‌లు ఉన్నాయని తెలిపారు. చీరాల ఓడరేవు, పాడురంగాపురం, సూర్యలంక, విజయలక్ష్మీపురం, రామాపురం, పొట్టి సుబ్బయ్యపాలెం బీచ్‌లు ఉన్నాయని వివరించారు.
పర్యాటక శాఖ ప్రత్యేక
ముఖ్య కార్యదర్శి అజయ్ జైన్
Comments
Please login to add a commentAdd a comment