బ్యాంక్ ఉద్యోగుల నిరసన
కొరిటెపాడు(గుంటూరు): బ్యాంకు ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఈనెల 24, 25 తేదీల్లో నిర్వహించ తలపెట్టిన దేశ వ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని బ్యాంకు ఉద్యోగ సంఘాల ఐక్య వేదిక పిలుపునిచ్చింది. ఈమేరుక ఉద్యోగులు, అధికారులు శుక్రవారం చంద్రమౌళి నగర్‌లోని కెనరా బ్యాంక్ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. బ్యాంక్ ఉద్యోగ సంఘాల ఐక్య వేదిక(యుఎఫ్‌బీయూ) జిల్లా కన్వీనర్ బాషా మాట్లాడుతూ బ్యాంక్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఎస్‌బీఐ ఉద్యోగ సంఘ నేత పరేంద్ర మాట్లాడుతూ ఐడీబీఐ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తున్నట్టు పేర్కొన్నారు. ఉద్యోగుల సమస్యలు పరిష్కరించకుంటే ఆందోళన ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment