ఎస్‌టీపీ ప్లాంట్ పరిశీలన
తెనాలిఅర్బన్: తెనాలి పూలే కాలనీలో ట్రైయిల్ రన్ నిర్వహిస్తున్న ఎస్‌టీపీ ప్లాంట్‌ను త్వరలో ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నామని పబ్లిక్ హెల్త్ రాష్ట్ర చీఫ్ ఇంజినీర్ మరియన్న పేర్కొన్నారు. శనివారం ఎస్‌టీపీ ప్లాంట్‌ను పరిశీలించి నిర్మాణాలపై ఆరా తీశారు. మిగిలిన చిన్న చిన్న మరమ్మతులను పూర్తి చేయాలని, గ్రీనరీని ఏర్పాటు చేయాలని సూచించారు. అలాగే సచివాలయాల పరిధిలోని ఇమ్యూనిటీ సెక్రటరీలకు ఎస్‌టీపీ పనితీరుపై శిక్షణ ఇవ్వాలని ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెనాలి పూలే కాలనీలో సుమారు రూ.30 కోట్లతో ఎస్‌టీపీ ప్లాంట్ నిర్మించడం జరిగిందన్నారు. దాదాపు పనులు పూర్తయ్యాయని, కొద్ది రోజులుగా ట్రైయిల్ రన్ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. త్వరలో రాష్ట్ర మంత్రులతో దీనిని ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. ఆయన వెంట పబ్లిక్ హెల్త్ ఎస్‌ఈ శ్రీనివాసరావు, డీఈ శివరామకృష్ణ, మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న, ఇన్‌చార్జి ఎంఈ ఆకుల శ్రీనివాసరావు, డీఈలు సుబ్బారావులు, శ్రీనివాసరావు, ఏఈలు ఫణీ, సూరిబాబు, సునీల్ ఉన్నారు.
భారీ చోరీలపై
కీలక ఆధారాలు లభ్యం
ప్రత్యేక బృందాలతో గాలింపు
లక్ష్మీపురం: గుంటూరు నగరంలో భారీ చోరీ ఘటనను పోలీసులు సీరియస్‌గా తీసుకున్నారు. జిల్లా ఎస్పీ సతీష్‌కుమార్ ఆదేశాల మేరకు వెస్ట్ డీఎస్పీ కె.అరవింద్, సీసీఎస్, పట్టాభిపురం పోలీసులతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఇప్పటికే చోరీలకు సంబంధించి కీలక ఆధారాలు సేకరించినట్లు సమాచారం. వివరాలు.. విద్యానగర్ 3/6 ప్రాంతంలో ఒకే రోజు రెండు ఇళ్లల్లో రూ.2.50 కోట్ల విలువ చేసే బంగారు ఆభరణాలు చోరీ ఘటన సంచలనం సృష్టించింది. చోరీ చేసిన వైనాన్ని సీసీ ఫుటేజ్ ద్వారా పరిశీలించిన పోలీసులు దొంగతనానికి పాల్పడిన వారు ఉమ్మడి గుంటూరు, కృష్ణా జిల్లాలకు చెందిన వారుగా గుర్తించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే అనుమానితులుగా ఉన్న వారిని అదుపులో తీసుకుని విచారణ చేస్తున్నారు. చిరంజిలాల్ ఇంట్లో జరిగిన చోరీకి సంబంధించి అయితే నూతన భవన నిర్మాణ పనులకు వచ్చిన వారిని విచారిస్తున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే పట్టాభిపురం పోలీస్‌స్టేషన్‌లో మూడు నెలలు క్రితం ఎస్‌వీఎన్ కాలనీ, బృందావన్ గార్డెన్స్‌లో రిటైర్డ్ డీఎస్పీ నివాసంలో కూడా ఇదే తరహాలో కోట్ల రూపాయలు విలువ చేసే బంగారు ఆభరణాలను చోరీ ఘటన చోటుచేసుకుంది. గతంలో జరిగిన దొంగతనాలకు సంబంధించి దొంగలు దొరికారు కాని చోరీకి గురైన బంగారం మాత్రం ఇంత వరకు రికవరీ చేయలేకపోయారు. దొంగతనం చేసిన వారిని సీసీ ఫుటేజ్ ద్వారా గుర్తించిన పట్టాభిపురం పోలీసులు చోరీ చేసిన వ్యక్తులు మహారాష్ట్రకు సంబంధించిన వారుగా గుర్తించారు. నేరస్తులను పట్టుకునేందుకు పట్టాభిపురం సీఐ, సిబ్బందితో ముంబాయి నగరానికి వెళ్లారు. అయితే ఇంత వరకు ఆ కేసు కొలిక్కి రాలేదు. ప్రస్తుత ఎస్పీ సతీష్‌కుమార్ కేసు ఛేదనకు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్లు సమాచారం.
ఎస్‌టీపీ ప్లాంట్ పరిశీలన
Comments
Please login to add a commentAdd a comment