మాజీ సీఎం దిష్టిబొమ్మ దహనం అమానుషం
పర్చూరు(చినగంజాం): రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దిష్టిబొమ్మను తగులబెట్టడం అమానుష చర్య అని వైఎస్సార్ సీపీ దళిత నాయకుడు గేరా స్వరాజ్ కుమార్ అన్నారు. శుక్రవారం సాయంత్రం పర్చూరు బొమ్మల సెంటర్‌లో మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దిష్టిబొమ్మను జనసేన పార్టీ నాయకులు తగులబెట్టడంపై ఆయన తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. శనివారం విలేకరులతో మాట్లాడారు. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ జగన్‌మోహనరెడ్డిని విమర్శించిన తరువాత మాత్రమే ఆయన ప్రతి విమర్శ చేశారని, కానీ ఆయన చేసిన విమర్శ వాస్తవమేనన్నారు. వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి పార్టీ స్థాపించిన దగ్గర నుంచి ఒకే ఒక్కడు పోరాటం చేసి ముఖ్యమంత్రి కాగలిగాడని, కానీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ముందు ప్రజారాజ్యం పార్టీతో మొదలు పెట్టి వెనుదిరిగారని, జనసేన పార్టీని స్థాపించిన దగ్గర నుంచి ముందుగా బీఎస్‌పీతో పొత్తు పెట్టుకున్నారని తెలిపారు. తరువాత సీపీఎం, సీపీఐలతో పొత్తు, అటు తరువాత బీజేపీ, తదుపరి టీడీపీలతో పొత్తులు పెట్టుకొని, ఒంటరిగా పోటీ చేసే ధైర్యం లేని పరిస్థితుల్లో ఆయన కూటమి కట్టి ఎంఎల్‌ఏ ఆయ్యారని విమర్శించారు. జగన్‌మోహన్ రెడ్డి చేసిన విమర్శను సద్విమర్శగా తీసుకొని ఒంటరిగా పోటీ చేసి గెలుపును సాధించాలని సవాల్ విసిరారు. రాష్ట్రంలో వైఎస్సార్ సీపీ ఓడిపోయినప్పటికీ 40 శాతం ఓట్లు సాధించగలిగిన పార్టీ అన్నారు. కూరాకుల కిరణ్, నలిగల ప్రభుకుమార్, పి. జయకృష్ణ, కాకులూరి సుధీర్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment