లక్ష్యానికి తూట్లు.. పశుపోషకుల పాట్లు
బల్లికురవ: గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఏర్పరచిన ఉన్నత లక్ష్యాలకు నేటి కూటమి ప్రభుత్వం తూట్లు పొడుస్తోంది. మూగ జీవాలకు అత్యవసర వైద్యసేవలను ఆయా గ్రామాల్లోనే అందించేందుకు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్రవ్యాప్తంగా నియోజకవర్గానికి రెండు చొప్పున 350 సంచార పశువైద్య వాహనాలను కేటాయించారు. బాపట్ల జిల్లాలోని అద్దంకి, పర్చూరు, చీరాల, బాపట్ల, వేమూరు, రేపల్లె నియోజకవర్గ కేంద్రాలకు తొలి విడతలో 2022 మే నెలలో ఆరు వాహనాలను కేటాయించారు. 2023 ఫిబ్రవరిలో నియోజకవర్గానికి రెండో వాహనాన్ని కేటాయించారు. ఇలా మొత్తం జిల్లాకు 12 వాహనాలు కేటాయించారు. రెండు నుంచి మూడు మండలాలకు కలిపి ఈ సంచార వాహనాన్ని కేటాయిస్తూ ఆయా పశువైద్యశాలలో పశుపోషకులకు అందుబాటులో ఉంచారు. ఈ వాహనానికి వైద్యుడు, ప్యారావిట్, పైలట్ పోస్టులు కేటాయించారు. గ్రామాలవారీగా పశుపోషకులకు అత్యవసర వైద్య సేవలందించేందుకు 1962 టోల్‌ఫ్రీ నంబర్‌ను కేటాయించారు. ఈ నెంబర్‌కు ఫోన్‌చేసి రైతు పేరు, గ్రామం, లోకేషన్, మండలం, జిల్లా తెలియచేయగానే వెంటనే గ్రామానికి వాహనం వచ్చి వైద్య సేవలందిస్తారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పశువైద్యసేవలను నిర్వీర్యం చేసింది. కాంట్రాక్టును పునరుద్ధరించకపోవడంతో మొదటివిడత జిల్లాకు వచ్చిన ఆరు వాహనాలను ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. రెండో విడతలో వచ్చిన వాహనాలు మెయింట్‌నెన్స్‌లేక పశువైద్యశాలలకే పరిమితమయ్యాయి.
గడువు పునరుద్ధరించక..
అంబులెన్స్‌ల నిర్వాహణ బాధ్యతను రాష్ట్రవ్యాప్తంగా జీవీకే ఫౌండేషన్‌కు అప్పగించటంతో మూడు సంవత్సరాలుగా వైద్యులు, సిబ్బంది జీతాలు, మెయింటనెన్స్ సక్రమంగానే అందించారు. అయితే ఈ ఏడాది ఫిబ్రవరి 28తో నిర్వహణ కాలవ్యవధి పూర్తవటంతో మొదటి విడతలో అందించిన వాహనాలను జిల్లా కేంద్రాలకు తెప్పించుకున్నారు. రెండో విడత వాహనాలకు మెయింట్‌నెన్స్ నిలిచి పోవటంతో పశువైద్యాశాలలకే పరిమితం అయ్యాయి. బల్లికురవ, సంతమాగులూరు మండలాలకు కేటాయించిన వాహనం బల్లికురవ పశువైద్యశాలలో మార్టూరు, యద్దనపూడి మండలాలకు కేటాయించిన వాహనం మార్టూరు వైద్యశాలకే పరిమితం అయింది.
నిలిచిన సంచార పశు వైద్యసేవలు జిల్లాకు రెండు విడతల్లో 12 వాహనాలను కేటాయించిన గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం జీవీకే ఫౌండేషన్‌కు నిర్వహణ బాధ్యతలు 1962 టోల్‌ఫ్రీ ద్వారా గ్రామాల్లో అంబులెన్స్ సేవలు మొదటి విడత ఆరు వాహనాలకు గడువు పొడిగించని కూటమి ప్రభుత్వం మెయింటెనెన్స్ లేక మూలన పడిన రెండోవిడత ఆరు వాహనాలు అయోమయంలో పశుపోషకులు
లక్ష్యానికి తూట్లు.. పశుపోషకుల పాట్లు
Comments
Please login to add a commentAdd a comment