ప్రార్థనతోనే దేవుడి అనుగ్రహం
అమరావతి: ‘‘ప్రభువైన ఏసుక్రీస్తు కృప లోకమంతా నిండియున్నదని, మానవుడు దేవుని ఎంతగా ప్రార్థిస్తే అంతగా దేవుడికి దగ్గరవుతాడని హోసన్నా మినిస్ట్రీస్ చీఫ్ పాస్టర్ జాన్‌వెస్లీ అన్నారు. ఆదివారం మండల పరిధిలోని లేమల్లె హోసన్నా దయా క్షేత్రంలో హోసన్నా మినిస్ట్రీస్ నిర్వహిస్తున్న 48వ గుడారాల పండుగ చివరి రోజు పగటిపూట ముగింపు ప్రార్థనలకు లక్షలాది మంది ఆరాధికులు తరలివచ్చారు. పాస్టర్ జాన్‌వెస్లీ ప్రసంగిస్తూ.. జాతి, కుల, మత, వర్గ, పేద, ధనిక భేదం లేకుండా అందరికీ దేవుని కృప ఉంటుందని, ఆయన్ను స్తుతిస్తూ బలి పీఠం దగ్గరకు ఎవరు వస్తారో వారిపై ప్రత్యేక కృప కనబరుస్తాడని పేర్కొన్నారు. ప్రపంచంలో అందరి పైనా ఆయన వర్షం కురిపించినా అత్మీయులపై మాత్రం కృపా వర్షం కురిపిస్తాడని పేర్కొన్నారు. హోసన్నా మినిస్ట్రీస్ అధ్యక్షుడు పాస్టర్ అబ్రహాం ప్రసంగిస్తూ.. గుడారాల పండుగలో దేవుని దర్శించిన ప్రతి ఒక్కరి వెంట ఆయన వస్తున్నాడని.. మంచిని కలుగచేస్తాడని తెలిపారు. దురాత్మలను దూరం చేసి సంతోషం కలుగ చేస్తాడని వివరించారు. ఎంతో దూరం నుంచి వచ్చిన లక్షలాది మంది విశ్వాసులకు పూర్తి స్థాయిలో వసతులు కల్పించకపోయినా, సర్దుకు పోయిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. వచ్చే ఏడాది మార్చి 5,6,7,8 తేదీల్లో గుడారాల పండుగ నిర్వహిస్తామని ప్రకటించారు. గుడారాల పండుగకు సహకరించిన అన్ని ప్రభుత్వశాఖల అధికారులకు, సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. లక్షలాదిమంది విశ్వాసులు పాల్గొన్నారు.
ముగిసిన 48వ గుడారాల పండుగ ముగింపు ప్రార్థనలు చేసిన పాస్టర్లు జాన్‌వెస్లీ, అబ్రహాం దయా క్షేత్రానికి చేరుకున్న లక్షలాది మంది విశ్వాసులు
ప్రార్థనతోనే దేవుడి అనుగ్రహం
ప్రార్థనతోనే దేవుడి అనుగ్రహం
Comments
Please login to add a commentAdd a comment