ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి పోరాటం
తెనాలి: ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి ఎస్‌టీయూ నిరంతరం పోరాటం చేస్తుందని యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.సాయి శ్రీనివాస్ చెప్పారు. ఉపాధ్యాయ బదిలీలపై ప్రభుత్వం ప్రత్యేకచట్టం చేసిందని గుర్తుచేశారు. అలాగే పీఆర్‌సీ బకాయిలు, డీఏ ఇవ్వాలని, పెండింగు సమస్యలను పరిష్కరించాలని కోరుతున్నట్టు తెలిపారు. ఎస్టీయూ, ఏపీ ఉపాధ్యాయ సంఘం, ఉమ్మడి తెనాలి ఏరియా (తెనాలి అర్బన్, తెనాలి, దుగ్గిరాల, కొల్లిపర, చుండూరు, అమర్తలూరు, వేమూరు, కొల్లూరు మండల శాఖలు) ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని శనివారం రాత్రి ఘనంగా నిర్వహించారు. స్థానిక ఎన్జీవో కళ్యాణమండపంలో జరిగిన ఈ వేడుకలకు ఎస్టీయూ తెనాలి ఏరియా కార్యదర్శి డీవీ సుబ్బారావు అధ్యక్షత వహించారు. ఆత్మీయ అతిథిగా పాఠశాల విద్య ఆర్‌జేడీ బి.విజయభాస్కర్ మాట్లాడుతూ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఏఐఎస్‌టీఎఫ్ జాతీయ ఆర్థిక కార్యదర్శి సీహెచ్ జోసెఫ్ సుధీర్ బాబు, గుంటూరు జిల్లా అధ్యక్షుడు డి.పెదబాబు, రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు ఎస్.రామచంద్రయ్య, రాష్ట్ర ఉపాధ్యక్షుడు కేఏకే జిలాని, జిల్లా ప్రధాన కార్యదర్శి సుబ్బారెడ్డి, బాపట్ల జిల్లా ప్రధాన కార్యదర్శి అమరనాథ్, జిల్లా గౌరవ అధ్యక్షుడు ఏవీ ప్రసాద్ బాబు, వేమూరు ఏరియా కార్యదర్శి ఎం.శ్రీధర్, డాక్టర్ శారద మాట్లాడారు. దుగ్గిరాల జిల్లాపరిషత్ బాలికల ఉన్నత పాఠశాల, ప్రధానోపాధ్యాయిని శోభాదేవి, కవయిత్రిగా గుర్తింపును తెచ్చుకున్న కొలకలూరు ఉపాధ్యాయిని దేవికరాణి, వివిధ మండల శాఖల మహిళా కన్వీనర్లు సహా 23 మందిని ఘనంగా సత్కరించారు. ఉమ్మడి తెనాలి ఏరియా కార్యదర్శి ఎం.శ్రీధర్‌తోపాటు ఏరియాలోని అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఏవీ గోపాలరావు, ఎం.రవి, జి.మిథున్ చక్రవర్తి, ఎస్.నాగేశ్వరరావు, ఉన్నం ప్రసాద్, మునిపల్లి మోహన కృష్ణ, ఖాన్, ఆరోన్, వినోద్, ప్రసాద్, నాగరాజు, చంద్రశేఖర్, కిరణ్, నాగరాజు, శ్రీనివాస్, రామకృష్ణ, సీనియర్ నాయకులు ఈ.అంబరీషుడు, పట్టణ శాఖ నాయకులు పూషాడపు శ్రీనివాసరావు, ఉమ్మడి తెనాలి ఏరియాలోని రాష్ట్ర కౌన్సిలర్లు, జిల్లా కార్య నిర్వాహక సభ్యులు, మండల కార్యనిర్వాహక సభ్యులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment