పిందె రాలడానికి పోషకాల లోపమే కారణం
వేటపాలెం: మామిడి చెట్లలో పోషకాల లోపాలతో పిందెలు రాలుతాయని గుంటూరు జిల్లా లాం ఫారం కీటక నివారణ శాస్త్రవేత్త నాగేంద్రరెడ్డి పేర్కొన్నారు. మండల పరిధిలోని రామన్నపేట, పందిళ్లపల్లిలో మామిడి తోటలను సోమవారం పరిశీలించి, రైతులకు పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. ఆయన మాట్లాడుతూ పిందె రాలకుండా పోషక లోపాలను నివారించుకోవాలని సూచించారు. రైతులు దిగుబడులు పెంచుకోవడానికి ప్రూట్ కవర్లు వాడాలని తెలిపారు. కాయ నిమ్మకాయ సైజులో ఉండగానే కవర్లు కట్టుకోవాలని చెప్పారు. మామిడి తోటల్లో తేనె మంచు పురుగులు నివారణకు సూచనలు ఇచ్చారు. పూతని ఆశించే గొంగళి పురుగులు, ఆకు తినే పురుగులు, గూడు కట్టుకొనే పురుగులు ఎక్కువైనప్పుడు వెంటనే నివారణ చర్యలు చేపట్టాలని తెలిపారు. కార్యక్రమంలో పలువురు రైతులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment