అద్దంకి రూరల్: కోరిన కోర్కెలు తీర్చే స్వామిగా భక్తులు నమ్మకంతో మహిమాన్విత క్షేతంగా విరాజిల్లుతోంది బాపట్ల జిల్లా అద్దంకి మండలంలోని శింగరకొండ క్షేత్రం. కొండపైన లక్ష్మీ నరసింహస్వామి, కొండకింద ప్రసన్నాంజనేయస్వామి నెలకొన్నారు. శింగరకొండ క్షేత్రం 14వ శతాబ్దం నాటికే కొండపై లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం భక్తుల పూజలందుకుంటోంది. సుమారు 150 సంవత్సరాల కిందట లక్ష్మీనరసింహ స్వామి వారి దేవాలయ ప్రాంగణంలో ధ్వజస్తంభం ప్రతిష్ట జగుతుండగా తేశి తటాకం ఒడ్డున ప్రసన్నాంజనేయస్వామి విగ్రజోవంతమైన యోగీశ్వరుడు కొండ దిగువున ప్రసన్నాంజనేయస్వామి విగ్రహం పూజించి అదృశ్యమయ్యారు. ఆ అద్భుతాన్ని కొండ మీద నుంచి చూసిన భక్తులు భక్తిశ్రద్ధలతో స్వామివారిని పూజించి తరించారు. అప్పటి నుంచి శింగరకొండలో వెలసిన ప్రసన్నాంజనేయస్వామివారి దేవస్థానం దివ్యక్షేత్రమై విరాజిల్లుతోంది.
దక్షిణాభిముఖం ఆలయం విశిష్టత
శ్రీరామచంద్రుడు ఆజ్ఞ మేరకు సీతమ్మ తల్లిని వెతుకుతూ దక్షిణ పథంగా బయలుదేరిన ఆంజనేయుడు ఇక్కడ కొంత సేపు విశ్రాంతి తీసుకున్నాడని ఒక నమ్మకం. అందువల్లనే ఈ క్షేత్రంలో ప్రసన్నాంజనేయుడు నెలవై ఉన్న దేవాలయం దక్షిణాముఖంగా ఉంది. అన్ని దేవాలయాలు తూర్పు ఉత్తర ముఖ ద్వారాలు కలిగి ఉండగా ఒక్క శింగరకొండ క్షేత్రం దక్షిణాభిముఖం కలిగి ఉండటం విశేషం.
క్షేత్ర దర్శనం సర్వపాపాల నివారిణి
కొండపైనున్న లక్ష్మీనరసింహస్వామి, కొండ కింద ప్రసన్నాంజనేయుడి దేవాలయాలతో ఉభయ దేవతా క్షేత్రంగా పేరుపొందిన శింగరకొండ క్షేత్రం దర్శనం సర్వపాపల నివారిణిగా భక్తుల నమ్మకం. ప్రతి మంగళ, శనివారాల్లో విశేషపూజలు, ఉగాది, శ్రీరామనవమి, హనుమజ్జయంతి, ముక్కోటి, సంక్రాంతి, తిరునాళ్లకు భక్తులు లక్షల సంఖ్య వచ్చి స్వామివారిని దర్శించుకుని ఆశీస్సులు పొందుతారు.
కొండపైన లక్ష్మీనరసింహస్వామి, కొండ కింద ప్రసన్నాంజనేయస్వామి దక్షిణాభిముఖంగా వెలసిన ప్రసన్నాంజనేయస్వామి విశిష్టత క్షేత్రదర్శనం సర్వపాపల నివారిణి భక్తుల నమ్మకం నేటి నుంచి 70వ వార్షిక తిరునాళ్ల ప్రారంభం తిరునాళ్లకు ఏర్పాట్లు పూర్తి ప్రత్యేక ఆకర్షణగా విద్యుత్ ప్రభలు
Comments
Please login to add a commentAdd a comment