స్టాకు రికార్డుల్లో తేడానా?
పర్చూరు(చినగంజాం): రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమీషన్ సభ్యురాలు బత్తుల పద్మావతి మంగళవారం పర్చూరులోని పలు పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఇందులో భాగంగా ముందుగా ట్రైబల్ వెల్ఫేర్ బాలుర గురుకుల పాఠశాలను తనిఖీ చేసి రికార్డులను పరిశీలించి విస్తుపోయారు. పాఠశాలలోని స్టాకుకు రికార్డుల్లో నమోదు చేసిన లెక్కలకు తేడాలు కనిపించడంతో ప్రిన్సిపాల్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యనభ్యసించే తరగతి గదుల్లోనే పిల్లలు నిద్రించడంపై పాఠశాల సిబ్బందిని వివరణ కోరారు. పాఠశాల ప్రిన్సిపాల్‌కు మెమో జారీ చేయాలని ఉన్నతాధికారులకు ఫోన్ ద్వారా ఫిర్యాదు చేశారు. పాఠశాల పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. పాఠశాల సమీపంలోని రెండు వైన్‌షాపులను తొలగించాలని ఎస్పీకి ఫోన్ చేసి సమాచారం అందించారు. పాఠశాల హిందీ ఉపాధ్యాయుడు పిల్లలను విపరీతంగా కొడుతున్నారన్న విషయం విద్యార్థులు కమిషన్ సభ్యురాలి దృష్టికి తీసుకొని వెళ్లారు. దీంతో ఆమె వెంటనే విచారణ జరిపి సదరు ఉపాధ్యాయుడికి చార్జి మెమో జారీ చేయాలని డీఈఓని ఆదేశించారు. అనంతరం ఎంపీయూపీ పాఠశాలను తనిఖీ చేసి పాఠశాల స్టాక్ గదిలో చిక్కీలు పడి ఉండటాన్ని గమనించి అసహనం వ్యక్తం చేశారు. పాఠశాల హెచ్‌ఎంను సంజాయిషీ కోరారు. రికార్డులను తనిఖీ చేసిన స్టాకుకి.. ఉన్న స్టాకుకి తేడాలను గమనించి ఆగ్రహం వ్యక్తం చేశారు. పాఠశాల హెచ్‌ఎం తీరుబాగోలేదని ఆయనకు మెమో జారీ చేయాలని డీఈఓకి ఫోన్ చేసి చెప్పారు. పాఠశాలలో విద్యార్థుల సంఖ్య 114 మంది ఉంటే మధ్యాహ్న భోజనం సమయానికి సగం మంది మాత్రమే తినడంపై ఆరా తీశారు. అనంతరం పర్చూరులోని పలు ప్రైవేట్ పాఠశాలలను తనిఖీ చేసి అక్కడ నెలకొన్న అసౌకర్యాలపై ఆమె తీవ్రంగా స్పందించారు. మండల విద్యాశాఖాధికారి వెంకటరామయ్య, సీడీపీఓ సుభద్ర, ఏఎస్‌ఐ సురేష్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు బత్తుల పద్మావతి బియ్యం, గుడ్లు, చిక్కీల్లో వ్యత్యాసంపై ఆగ్రహం తప్పు చేసిన వారికి మెమోలు జారీ చేయాలని డీఈఓకి సిఫారసు
Comments
Please login to add a commentAdd a comment