ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన విధంగా కూటమి పభుత్వం రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులకు చెల్లించాల్సిన ఫీజు రీయింబర్స్‌మెంట్, వసతి దీవెన బకాయిలు రూ.4,600 కోట్లు తక్షణం చెల్లించాలి. దీంతోపాటు మెడికల్ కళాశాల ప్రైవేటీకరణ ప్రతిపాదలను ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకొని పేద విద్యార్థులకు వైద్య విద్యను అందుబాటులోకి తీసుకరావాలి. అలా చేయని పక్షంలో వైఎస్సార్ సీపీ ఉద్యమాన్ని ఉధృతం చేస్తుంది.
– మాచవరపు రవికుమార్, రాష్ట్రకార్యదర్శి, వైఎస్సార్ సీపీ విద్యార్థి విభాగం
డీఎస్సీ ప్రకటించాలి
అధికారంలోకి రాగానే మెగా డీఎస్సీ ఫైల్‌పై తొలి సంతకం చేశారు. సంతకం చేసి పది నెలలైనా అతీగతీలేదు. తక్షణం డీఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వాలి. నిరుద్యోగులకు 20 లక్షల ఉద్యాగాలు ఇస్తామని, ఉద్యోగం రాని వారికి నెలకు రూ.3 వేలు భృతి ఇస్తామని హామీ ఇచ్చి ఎన్నికల్లో ఓట్లు వేయించుకున్నారు. ఉద్యోగం రాని వారికి భృతి ఇవ్వాలి.
–బొంత విజయకుమార్, బీకాం, బీపీఈడీ, బల్లికురవ
ప్రభుత్వం మాట నిలబెట్టుకోవాలి
బీటెక్ పూర్తిచేసి మూడేళ్లు దాటింది. ఉద్యోగవకాశాలు రాలేదు. ఎన్నికల సమయంలో చంద్రబాబు, కూటమి నేతలు అధికారంలోకి రాగానే ఉద్యోగాలు ఇస్తామన్నారు. ఉద్యోగాలు కల్పించడం ఆలస్యమైతే నిరుద్యోగ భృతికింద నెలకు రూ.3 వేలు ఇస్తామన్నారు. అధికారంలోకి వచ్చి పది నెలలు అవుతున్నా రెండూ ఇవ్వలేదు. ఇప్పటికై నా ప్రభుత్వం మాట నిలబెట్టుకోవాలి.
–దేవరకొండ అవినాష్, బీటెక్, బాపట్ల
బకాయిలు వెంటనే విడుదల చేయాలి
బకాయిలు వెంటనే విడుదల చేయాలి
Comments
Please login to add a commentAdd a comment