శనివారం శ్రీ 15 శ్రీ మార్చి శ్రీ 2025
వాసవీ మాతకు ప్రత్యేక పూజలు
దాచేపల్లి : స్థానిక శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి దేవాలయం తొమ్మిదో వార్షికోత్సవం సందర్భంగా అమ్మవారికి శుక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉత్సవ కమిటీ చైర్మన్ మాశెట్టి బుజ్జి, సభ్యులు పాల్గొన్నారు.
ముగిసిన బ్రహ్మోత్సవాలు
తెనాలి: బాలాజీరావుపేటలోని శ్రీదేవి, భూదేవి సమేత వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు శుక్రవారంతో ముగిశాయి. సాయంత్రం పెద్ద రథం ఊరేగింపు జరిగింది.
వైభవంగా బ్రహ్మోత్సవాలు
భట్టిప్రోలు : పెదపులివర్రులోని శ్రీ భూనీళా సమేత వరదరాజస్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా శుక్రవారం విష్వక్సేన పూజ, పుణ్యాహవచనం, నిత్య హోమం నిర్వహించారు.
విజయం ఇలా...
బాపట్లకు చెందిన బ్యాంక్ ఉద్యోగి భావన్నారాయణ నాలుగేళ్ల కిందట తన ఇంటి దస్తావేజులను గుంటూరు ఐసీఐసీఐ బ్యాంక్‌లో తనఖా పెట్టి రుణం తీసుకున్నాడు. అప్పు మొత్తం చెల్లించినప్పటికీ బ్యాంక్ అధికారులు దస్తావేజులు తిరిగి ఇవ్వలేదు. ఇదేమని అడిగితే దస్తావేజులు పోయాయని చెప్పారు. దీంతో రెండేళ్ల కిందట భావన్నారాయణ గుంటూరులోని కన్జ్యూమర్ కోర్టును ఆశ్రయించాడు. బాధితుడి వాదనలు విన్న కోర్టు బ్యాంక్ అధికారులకు రూ.లక్ష జరిమానా విధించి, ఆ సొమ్మును బాధితుడికి అందజేయాలని తీర్పు ఇచ్చింది. బ్యాంక్ అధికారులు రూ.లక్ష నగదు అందజేశారు.
ప్రతి వస్తువులో కల్తీలు జరుగుతున్నాయి. తూకాల్లోనూ మోసాలు జరుగుతున్నాయి. మోసపోయామని తిరిగి వెళ్లినప్పటికీ యజమానులు సరైన సమాధానం చెప్పడం లేదు. అధికారులు స్పందించి వ్యాపార సముదాయాల్లో తనిఖీలు ముమ్మరం చేయాలి. తూకాల్లో జరుగుతున్న మోసాలను అరికట్టాలి. కాలం చెల్లిన వస్తువులను కూడా విరివిగా విక్రయిస్తున్నారు. వాటిపై ప్రత్యేక దృష్టి సారించి వాటిని నివారించాలి.
–షేక్ రబ్బానీ, వినియోగదారుడు
ఇఫ్తార్ సహర్
(శని) (ఆది)
బాపట్ల 6.23 4.59
నరసరావుపేట 6.25 5.01
గుంటూరు 6.23 4.59
అవగాహనతోనే
అక్రమాలకు అడ్డుకట్ట
● తూకాల్లో విరివిగా మోసాలు ● వినియోగదారులు ఆదమరిస్తే భారీనష్టం
● చట్టాలపై ప్రతి ఒక్కరికీ అవగాహన అవసరం ● నేడు ప్రపంచ వినియోగదారుల దినోత్సవం
7
న్యూస్‌రీల్
అధికారులు చర్యలు తీసుకోవాలి
బాపట్ల
బాపట్ల
బాపట్ల
బాపట్ల
బాపట్ల
బాపట్ల
బాపట్ల