అద్దంకి: పుణ్యక్షేత్రమైన ప్రసన్నాంజనేయ స్వామి 70వ వార్షిక తిరునాళ్ల సందర్భంగా శుక్రవారం రాత్రి శింగరకొండ భక్తజనసంద్రంగా మారింది. ప్రసన్నాంజనేయ స్వామివారిని దర్శించుకున్న భక్తులు భక్తి పారవశ్యంతో మునిగిపోయారు. తిరునాళ్ల సందర్భంగా ఆలయ రాజగోపురాలు, పరిసరాల్లో ఏర్పాటుచేసిన విద్యుత్ సెట్టింగులతో క్షేత్రం మొత్తం దేదీప్యమానంగా వెలిగిపోయింది. విద్యుత్ ప్రభపై ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు, వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన, భక్తుల రద్దీతో క్షేత్ర పరిసరాలు ఇరుకుగా మారాయి.
650 మంది పోలీసు బలగాలతో పర్యవేక్షణ
ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా నలుగురు డీఎస్పీలు, 13 మంది సీఐలు, 46 మంది ఎస్సైలు, 587 పోలీసు సిబ్బందితో పటిష్ట బందోబస్తు నిర్వహించారు. తిరునాళ్ల ఇన్‌చార్జిగా చీరాల డీఎస్పీ మెయిన్ వ్యవహరించారు. సీఐ సుబ్బరాజు ఆధ్వర్యంలో భక్తులకు ఇబ్బంది లేకుండా బందోబస్తు నిర్వహించారు. ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా శుక్రవారం సాయంత్రం 5 గంటల నుంచి, సంతమాగులూరు మండ లం పుట్టావారిపాలెం అడ్డరోడ్డు, మేదరమెట్ల పైలా న్ వద్ద, రేణింగవరం జాతీయ రహదారి నుంచి అద్దంకి వైపు భారీ వాహనాలను దారి మళ్లించారు. 99అడుగుల అభయాంజనేయస్వామి విగ్రహ సమీపంలో 10పార్కింగ్ ప్రదేశాలను ఏర్పాటు చేశారు.
వైభవంగా శింగరకొండ తిరునాళ్ల
అద్దంకి/అద్దంకి రూరల్: జిల్లాలోనే ప్రముఖ పుణ్యక్షేత్రమైన శింగరకొండ ప్రసన్నాంజనేయస్వామి, కొండపైనున్న శ్రీ లక్ష్మీనరసింహస్వామివార్ల 70వ వార్షిక తిరునాళ్ల శుక్రవారం వైభవంగా నిర్వహించారు. తిరునాళ్ల సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో స్వామివారిని దర్శించుకున్నారు. ఉదయం నుంచే క్షేత్రం భక్తులతో కిక్కిరిసిపోయింది. ఆలయ పరిసరాలను విద్యుత్ దీపాలతో అలంకరించారు. శ్రీశైలం దేవస్థాన డిప్యూటీ కమిషనర్ రమణమ్మ ప్రత్యేకాధికారిగా, ఏసీ తిమ్మనాయుడు సిబ్బంది, ప్రత్యేక సిబ్బంది సహకారంతో భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా, ఉచిత దర్శనంతోపా టు, వీఐపీ, వికలాంగులకు, వృద్ధులకు, ప్రత్యేక దర్శన క్యూలైన్లతోపాటు, వివిధ ధరలతో కూడిన దర్శన క్యూలను ఏర్పాటుచేశారు. క్యూలైన్లలోని భక్తులకు మజ్జిగ, తాగునీరు, దర్శనం చేసుకున్న భక్తులకు ఉచిత ప్రసాదం పంపిణీ చేశారు.
ప్రత్యేక పూజలు..
ప్రసన్నాంజనేయస్వామి దేవస్థానంలో చీరాల ఆర్డీవో చంద్రశేఖర్‌నాయుడు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు, వేదపండితులు ఆశీర్వచనం అందజేసి తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. మహిళా భక్తులు స్వామివారికి చక్కెర పొంగలి వండి, కుండలను నెత్తిన పెట్టుకుని దర్శనంతో మొక్కులు తీర్చుకున్నారు. కొండ మీద శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో దేవదాయ శాఖ ఈవో కోటిరెడ్డి ఆధ్వర్యంలో స్వామివారికి కల్యాణం, సామూహిక వ్రతాల కార్యక్రమాన్ని నిర్వహించారు. భక్తులకు అసౌకర్యం కలుగకుండా పర్యవేక్షించారు.
వివిధ శాఖల ఆధ్వర్యంలో పర్యవేక్షణ
ఆలయ పరిసరాల్లో, విద్యుత్ శాఖ, మోదేపల్లి పీహెచ్‌సీ, పంచాయతీరాజ్, పోలీస్, రెవెన్యూ, ఆర్‌అండ్‌బీ, ఫైర్, మునిసిపల్‌తోపాటు, మండల పరిషత్, ఎల్‌ఐసీ, స్టేట్‌బ్యాంక్ వివిధ బ్యాంక్ బ్రాంచ్‌లు, స్వచ్ఛంద సేవా సంస్థలు వాసవి వనిత క్లబ్ ప్రకా శం ప్రభుత్వ హైస్కూల్1980–81 బ్యాంచ్ పదో తరగతి పూర్వ విద్యార్థులు ఆధ్వర్యంలో స్టాల్స్ ఏర్పాటుతో మజ్జిగ, తాగునీరు, పులిహోర పంపిణీ చేశారు.అన్ని సామాజిక సత్రాల్లో ఉదయం నుంచి రాత్రి వరకు అన్నదానం నిర్వహించారు.
ప్రత్యేక బస్సులు
అద్దంకి ఆర్టీసీ డిపో నుంచి ప్రత్యేక బస్సులు నడిపారు. వీటితోపాటు జిల్లాలోని వినుకొండ, నరసరావుపేట, చిలకలూరిపేట, ఒంగోలు, దర్శి, పొదిలితోపాటు వివిధ డిపోల నుంచి ప్రత్యేక బస్సులను నడిపారు. కొండమీద లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానానికి వెంకటాపురానికి చెందిన పాకనాటి అంజిరెడ్డి, పాకనాటి మధుసూదన్‌రెడ్డికి చెందిన రెండు బస్సుల్లో భక్తులను ఉచితంగా చేరవేశారు.
అంగళ్లు ఏర్పాటు
క్షేత్రానికి వెళ్లే రోడ్డుకు ఇరువైపులా ఏర్పాటు చేసిన బొమ్మలు, చెరుకు విక్రయ, వివిధ వస్తువుల దుకాణాలు ఏర్పాటుచేశారు.
భక్తులతో కిక్కిరిసిన
దేవస్థాన పరిసరాలు
సీసీ కెమెరాలు, డ్రోన్‌లతో ప్రత్యేక నిఘా
650 మంది పోలీసులతో బందోబస్తు
విద్యుత్ వెలుగుల్లో ప్రభలు
అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు
భక్తజన సంద్రంగా శింగరకొండ
భక్తజన సంద్రంగా శింగరకొండ