ప్రొఫెసర్ డాక్టర్ హీరాసింగ్
నగరం: కంప్యూటర్‌సైన్స్ అండ్ ఎలక్ట్రానిక్స్‌లో రాణించిన విద్యార్థులకు మంచి భవిష్యత్ ఉంటుందని హైదరాబాద్ శ్రీనిధి విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ డాక్టర్ హీరాసింగ్ అన్నారు. స్థానిక ఎస్వీఆర్‌ఎం కళాశాలలో శనివారం డిజైన్ థికింగ్ ఫర్ ఇన్నోవేషన్ అనే అంశంపై నిర్వహించిన జాతీయ సెమినార్‌లో డాక్టర్ హీరాసింగ్ పాల్గొని మాట్లాడారు. కంప్యూటర్ సైన్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ చదివిన విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు మెండుగా ఉన్నాయన్నారు. డిజైన్ థింకింగ్ అనేది వినియోగదారుల అవసరాలు, కోరికలను అర్ధం చేసుకొని వాటిని కంప్యూటర్ సైన్స్‌తో పరిష్కరించడమన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ (ఏఐ) అన్ని రంగాలలోను మానవాళి జీవనానికి ఎంతగానో ఉసయోగపడుతుందన్నారు. మనిషి చేసే ఎన్నో పనులను ఏఐ సాయంతో చేయగలుగుతున్నాయన్నారు.
ఏఐ సాంకేతికతను వినియోగించుకుని మానవాళి మనుగడకు ఉపయోగపడే అంశాలపై పరిశోధనలు చేయాలని విద్యార్థులకు సూచించారు. లక్కిరెడ్డి, బాలిరెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ ప్రొఫెసర్ డాక్టర్ సుధాకర్ ప్యూమన్ కంప్యూటర్ ఇంటరాక్షన్ గురించి విద్యార్థులకు వివరించారు. కార్యక్రమంలో కరస్పాడెంట్ వల్లభనేని బుచ్చియ్యచౌదరి, ప్రిన్పిసాల్ హరికృష్ణ, వైస్‌ప్రిన్సిపాల్ వెంకటనారాయణ, అకడమిక్ డైరెక్టర్ వెంకటేశ్వరరావు, కంప్యూటర్ సైన్స్ హెచ్‌వోడీ సజ్జా శ్రీనివాసరావు అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు.