అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి వేడుకగా పోటాపోటీ కార్యక్రమాలు
చీరాల: చీరాల తెలుగుదేశం పార్టీలో వర్గపోరు రోజురోజుకు అధికమవుతోంది. ఎమ్మెల్యే వర్సెస్ ఎంపీ రెండు గ్రూలులుగా విడిపోయారు. చివరకు పోటాపోటీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇసుక అక్రమ రవాణాలో వివాదం మొదలైంది. ఎంపీ వర్గీయులకు చెందిన పొక్లెయిన్లను ఎమ్మెల్యే వర్గీయులు తగలబెట్టారనే కారణంతో ఎంపీ, ఎమ్మెల్యే వర్గాలు రెండుగా చీలిపోయాయి. చాపకింద నీరులా ఇది పెరిగిపోయింది. ఆదివారం అమరజీవి పొట్టి శ్రీరాములు జయంత్యుత్సవం సందర్భంగా రెండు వర్గాలు పోటాపోటీ కార్యక్రమాలు చేపట్టాయి. రైల్వే బోర్డు మెంబర్‌గా ఉన్న ఎంపీ వర్గీయుడైన పఠాన్ ఆధ్వర్యంలో నాయకులంతా కలసి కామథేను కాంప్లెక్స్ వద్దనున్న శ్రీరాములు విగ్రహానికి పూలమాలలువేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో రాజే ష్, గవిని ప్రసాద్, నక్క ప్రకాష్, జంగా జ్యోతిప్రసాద్, గవిని మణికుమార్, శ్రీరాం రమేష్, ఆర్యవైశ్య నాయకులు పాల్గొన్నారు. కొద్ది సేపటి అనంతరం ఎమ్మెల్యే ఎం.ఎం.కొండయ్య అనుచరులు కూడా పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో పట్టణాద్యక్షుడు గజవల్లి శ్రీనివాసరావు, బీసీసెల్ అద్యక్షుడు కౌతవరపు జనార్దన్, ఎంఆర్‌ఎఫ్ రమేష్, ఉల్లిపాయల సుబ్బయ్య, గూడూరి శివరాంప్రసాద్, తదితరులు పాల్గొన్నారు. ఇదిలావుంటే ఎమ్మెల్యే ఎం.ఎం. కొండయ్యకు ఎంపీ తెన్నెటి కృష్ణప్రసాద్ మధ్య కొద్ది నెలలుగా కోల్డ్‌వార్ జరుగుతోంది. ఎంపీ చీరాలలో తన వర్గాన్ని ఏర్పాటు చేసుకుని కార్యక్రమాలను నిర్వహించడం విశేషం. చీరాలలో మొదటిసారిగా పోటాపోటీ కార్యక్రమాలు నిర్వహించారు.