వ్యోమగాముల రాకను కాంక్షిస్తూ ప్రదర్శన
నగరం: అంతరిక్ష పరిశోధనా కేంద్రం నుంచి భూమిపై తిరిగి బయలుదేరిన వ్యోమగాములు సునీతా విలియమ్స్ తదితరులు సురక్షితంగా చేరాలని శాంతినికేతన్ పాఠశాల విద్యార్థులు ఆకాంక్షించారు. వారికి స్వాగతం పలుకుతూ నగరంలోని పాఠశాలలో ఉన్న రాకెట్ బొమ్మ వద్ద మంగళవారం ప్రదర్శన చేపట్టారు. కార్యక్రమంలో సైన్స్ రచయిత బొర్రా గోవర్ధన్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
ఎంపీడీవోకు సన్మానం
జె.పంగులూరు: రెడ్ క్రాస్ సొసైటీలో ఎక్కువ మంది సభ్యులను చేర్పించినందుకు మంగళవారం కలెక్టర్ జె.వెంకట మురళి బాపట్లలోని తన కార్యాలయంలో ఎంపీడీవో స్వరూపారాణిని సన్మానించారు. రెడ్ క్రాస్ సొసైటీ వారికి మండల పరిధిలో 50 మందితో రూ.1,100 చొప్పున సభ్యత్వ రుసుము కట్టించినందుకు కలెక్టర్ సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ బాపట్ల మేనేజింగ్ కమిటీ మెంబర్ దాసరి ఇమ్మానియేలు పాల్గొన్నారు.
శక్తియాప్‌ను సద్వినియోగం చేసుకోవాలి
బాపట్ల టౌన్: శక్తి యాప్‌ను మహిళలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఎస్పీ తుషార్‌డూడీ తెలిపారు. జిల్లాలోని ప్రధాన కూడలి ప్రాంతాల్లో మంగళవారం శక్తి బృందాలు యాప్‌పై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఈ యాప్ ఉంటే ఆపద సమయాల్లో రక్షణగా ఉంటుందన్నారు. ఎస్.ఓ.ఎస్. బటన్ ప్రెస్ చేస్తే క్షణాల్లో పోలీసు బృందాలు చేరుకొని రక్షిస్తాయని తెలిపారు. జిల్లాలో ఎస్సై నేతృత్వంలో మొత్తం 5 శక్తి బృందాలు ఉన్నాయన్నారు.
వ్యోమగాముల రాకను కాంక్షిస్తూ ప్రదర్శన
వ్యోమగాముల రాకను కాంక్షిస్తూ ప్రదర్శన
Comments
Please login to add a commentAdd a comment