కిలోన్నర గంజాయి పట్టివేత
అమరావతి: మండల పరిధిలోని ధరణికోట ఆరు డొంకల బావి సెంటర్ సమీపంలో గురువారం మధ్యాహ్నం పోలీసులు దాడి చేసి కిలోన్నర గంజాయిని పట్టుకున్నారు. విశ్వసనీయ సమాచారంతో పోలీసులు ఆరు డొంకల బావి సెంటర్ సమీపంలోని పాగుబడిన కోళ్ల ఫారంలో గంజాయిని దాస్తుండగా పోలీసులు దాడి చేశారు. గమనించిన నిందితులు అక్కడే వదిలేసి పారిపోయారు.
పోలీసులు కిలోన్నర గంజాయితో పాటు ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా సీఐ అచ్చియ్య మాట్లాడుతూ పారిపోయిన వారి కోసం పోలీసు బృందాలు, ఈగల్ టీంలు గాలిస్తున్నాయని తెలిపారు. నిందితులను అదుపులోకి తీసుకున్న తర్వాత కేసు నమోదు చేస్తామని ఆయన చెప్పారు.