1న పర్చూరులో సీఎం పింఛన్లు పంపిణీ
బాపట్ల: ఏప్రిల్ ఒకటో తేదీన పర్చూరు నియోజకవర్గంలో పింఛన్ల పంపిణీ కార్యక్రమానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రానున్నట్లు జిల్లా కలెక్టర్ జె. వెంకట మురళి తెలిపారు. ఆదివారం స్థానిక కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో ఆయన అధికారులతో సమావేశం నిర్వహించారు. పర్చూరు నియోజకవర్గంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమానికి ‘పేదల సేవలో’ అని నామకరణం జరిగినట్లు తెలిపారు. జిల్లా ఇన్‌చార్జి మంత్రి, జిల్లా మంత్రులు, పార్లమెంట్ సభ్యులు, శాసనసభ్యులతో కార్యక్రమం గురించి చర్చించినట్లు పేర్కొన్నారు. జిల్లా రెవెన్యూ అధికారికి కలెక్టర్ పలు సూచనలు చేశారు. జిల్లా రెవెన్యూ అధికారి జి.గంగాధర్ గౌడ్, సీపీఓ శ్రీనివాసరావు, డీపీఓ ప్రభాకర్, డ్వామా పీడీ విజయలక్ష్మి, డీఆర్‌డీఏ పీడీ పద్మ, బాపట్ల డీఎల్డీవో విజయలక్ష్మి, బాపట్ల, చీరాల, రేపల్లె రెవెన్యూ డివిజనల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.