బాపట్ల: క్షయ వ్యాధి రహిత గ్రామాలు ఏర్పాటు కోసం అందరం కలిసి కట్టుగా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ జె.వెంకటమురళి పేర్కొన్నారు. ప్రపంచ క్షయ దినోత్సవం సందర్భంగా జిల్లాలోని 27 టీబీ రహిత గ్రామాలకు సిల్వర్, బ్రాంజ్ మోడల్స్‌ను సోమవారం అందించారు. జిల్లా కలెక్టర్‌కు సంబంధిత శాఖ అధికారులు మహాత్మాగాంధీజీ విగ్రహాన్ని అందించారు. జిల్లా వైద్యాధికారిణి డాక్టర్ విజయమ్మ మాట్లాడుతూ క్షయవ్యాధిని అరికట్టేందుకు వైద్యశాఖ అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు. ప్రపంచ క్షయవ్యాధి నివారణ దినోత్సవం సందర్భంగా బాపట్లలోని పాతబస్టాండ్ వద్ద మానవహారం చేపట్టారు. క్షయవ్యాధిపై ప్రదర్శన చేపట్టారు. ఆరోగ్యశాఖ బెస్ట్ ఎంప్లాయిస్ కింద ఎంపికై న వారికి సర్టిఫికెట్లు ప్రధానం చేశారు.
చిన్నబిడ్డలకు తల్లులు పాలిచ్చు గది ఏర్పాటు సంతోషకరం
కలెక్టరేట్‌లో ఏర్పాటుచేసిన చిన్న బిడ్డలకు తల్లులు పాలిచ్చు గదిని జిల్లా కలెక్టర్ జె వెంకట మురళి సోమవారం ప్రారంభించారు. ఏదైనా పనుల నిమిత్తం కలెక్టరేట్‌కు వచ్చే మహిళలకు ఇది ఎంతో సౌకర్యంగా ఉంటుందని చెప్పారు. పని ప్రదేశాలలో చిన్న బిడ్డలకు తల్లులు పాలిచ్చు గది తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చిందన్నారు. మహిళ లు, చిన్నారుల సంక్షేమం, హక్కుల పరిరక్షణకు చర్యలు తీసుకుంటామని కలెక్టర్ చెప్పారు. ప్రభుత్వ, ప్రైవేటు రంగాలు, ఇతర పని ప్రాంతాలలోనూ ఇలాంటి గదులు ఏర్పాటు చేసుకోవాలని ఆయన స్పష్టం చేశారు. కార్యక్రమంలో జిల్లా మహిళా శిశు సంక్షేమశాఖ పీడీ డి.రాధామాధవి, వ్యవసాయ శాఖ అధికారి రామకృష్ణ, సీడీపీవోలు, డీసీపీఓ పురుషోత్తం, అంగన్‌వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు.
క్షయ వ్యాధి రహిత గ్రామాల కోసం కృషి