
ట్రాక్టర్ బోల్తా పడి వ్యక్తి మృతి
గోళ్లపాడు (ముప్పాళ్ల): ప్రమాదవశాత్తు ట్రాక్టర్ బోల్తాపడి డ్రైవర్ మృతి చెందిన ఘటన మండలంలోని గోళ్లపాడు గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. కుందురువారిపాలెం గ్రామానికి చెందిన కామేపల్లి చంద్రశేఖర్ (32) తన ట్రాక్టర్‌లో మొక్కజొన్న విత్తనాలు లోడుతో పొలంలో వస్తున్నాడు. పొలంలో ఉన్న గుంతలో పడి డ్రైవర్ సీటులో ఉన్న చంద్రశేఖర్ ఎగిరి కింద పడ్డాడు. చంద్రశేఖర్ గుండెలపై గుండా ట్రాక్టర్, లోడుతో ఉన్న ట్రక్కు వెళ్లటంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ వి.సోమేశ్వరరావు తెలిపారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.