అధిక ధరలకు విక్రయిస్తున్న షాపులపై కేసులు
పాల్వంచ: పట్టణంలో ఎమ్మార్పీ కంటే అధిక ధరలకు వస్తువులు విక్రయిస్తున్న దుకాణాలపై జిల్లా తూనికలు, కొలతల శాఖ అధికారి మనోహర్ మంగళవారం దాడులు నిర్వహించారు. శాసీ్త్రరోడ్‌లో ఫ్యాన్సీ, ఇతర దుకాణాల్లో వస్తువులను పరిశీలించారు. ఎమ్మార్పీ లేకుండా సామగ్రి విక్రయిస్తున్నట్లు గుర్తించి రెండు కేసులు నమోదు చేశారు. రెండు నోటీసులు జారీ చేశారు. జరిమానా విధించనున్నట్లు ఆయన తెలిపారు.
ముగ్గురిపై కేసు నమోదు
పాల్వచరూరల్: దాడికి పాల్పడిన ముగ్గురిపై పోలీసులు మంగళవారం కేసు నమోదు చేశారు. మండలంలోని నాగారంకాలనీకి చెందిన బోడ వీరన్న, చంటి, దేవి సోమవారం రాత్రి దాడి చేసి గాయపరిచారని బానోతు మంచ్యా పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో దాడి చేసిన ముగ్గురిపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ సురేశ్ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment