22, 23వ తేదీల్లో కోలిండియా అథ్లెటిక్స్ మీట్
సింగరేణి(కొత్తగూడెం): కొత్తగూడెంలోని ప్రకాశం స్టేడియంలో ఈ నెల 22, 23వ తేదీల్లో కోలిండియా స్థాయి(పురుషులు, మహిళలు) అథ్లెటిక్స్ మీట్ నిర్వహణకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈమేరకు వివరాలను జీఎం పర్సనల్(ఐఆర్‌పీఎం) కవితానాయుడు మంగళవారం నిర్వహించిన సమావేశంలో వెల్లడించారు. కోలిండియా పరిధిలోని 10 బొగ్గు పరిశ్రమల నుంచి దాదాపు 320 మంది క్రీడాకారులు పోటీలకు హాజరుకానున్నారని తెలిపారు. పోటీలను సింగరేణి సీఎండీ ఎన్.బలరామ్ ప్రారంభించనుండగా, క్రీడాకారులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తగిన ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. టోర్నీ ఏర్పాట్లు, నిర్వహణ బాధ్యతల పర్యవేక్షణ బాధ్యతలను వివిధ విభాగాల అధికారులకు అప్పగించి, రిఫరీలుగా 26మందిని నియమించామని తెలిపారు. ఈసమావేశంలో వివిధ విభాగాల అధికారులు కె.అజయ్‌కుమార్, రాజేంద్రప్రసాద్, బి.సుశీల్‌కుమార్, టి.శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
కొత్తగూడెంలో నిర్వహణకు ఏర్పాట్లు
Comments
Please login to add a commentAdd a comment