ఇంటి నిర్మాణానికి అడ్డుకట్ట
దుమ్ముగూడెం: మండలంలోని పర్ణశాలలో నిర్మిస్తున్న ఇంటి నిర్మాణాన్ని దేవస్థానం అధికారు లు అడ్డుకున్న ఘటన మంగళవారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ముత్తి గురుమూర్తి సర్వే నంబర్–1లోని ఐదు సెంట్ల భూమిలో ఇంటి నిర్మాణం చేపడుతుండగా పర్ణశాల దేవస్థా నం అధికారులు.. ఆ స్థలం ఆలయానికి సంబంధించినదని నిర్మాణాన్ని అడ్డుకున్నారు. గురుమూర్తి 2010లో ఆ స్థలాన్ని ఇదే గ్రామానికి చెందిన చాట్ల రామకృష్ణారెడ్డి వద్ద కొన్నానని చెబుతున్నాడు. కాగా దేవస్థానం అధికారులు ఈ స్థ లానికి సంబంధించిన పట్టా చూపించి రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేశారు. తహసీల్దార్ అశోక్‌కుమార్ ఆదేశాల మేరకు ఆర్‌ఐ నరసింహారావు ఘటనా స్థలానికి చేరుకుని దేవస్థానం అధికారులు చూపించిన ఆధారాలను పరిశీలించి.. ఆ స్థలంలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టొద్ద ని సూచించారు. బాధితుడి వద్ద సరైన ఆధారా లు ఉంటే తహసీల్దార్ కార్యాలయంలో సంప్రదించాలని, అప్పటివరకు ఇరు వర్గాల వారు ఆ స్థలంలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టవద్దని పేర్కొన్నారు.
ఈత కొట్టిన ఎమ్మెల్యే..!
ఇల్లెందు: పట్టణంలోని లేక్‌వ్యూ పార్క్‌లో నిర్మించిన కొలనులో స్విమ్మింగ్ మంగళవారం ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోరం కనకయ్య ఈత కొట్టి అందరినీ ఉత్సాహపరిచారు. ఆయన వెంట మున్సిపల్ మాజీ చైర్మన్ డి.వెంకటేశ్వరరావు, పలువురు కాంగ్రెస్ నేతలు, మాజీ కౌన్సిలర్లు ఉన్నారు.
ఖేలో ఇండియా
ఆర్చరీ పోటీల్లో ప్రతిభ
దమ్మపేట: బెంగళూరులో ఇటీవల నిర్వహించిన ఖేలో ఇండియా సౌత్ జోన్ ఆర్చరీ పోటీల్లో దమ్మపేట మండలం పట్వారిగూడెంనకు చెందిన 9వ తరగతి విద్యార్థిని కనకం లోహితశ్రీ ప్రతిభ కనబరిచి కాంస్య పతకం దక్కించుకుంది. ఆమె రికర్వ్ విభాగలో పతకం గెలుచుకోగా పలువురు అభినందించారు. ప్రస్తుతం లోహితశ్రీ హైదరాబాద్ హకీంపేటలోని ప్రభుత్వ క్రీడా పాఠశాలలో చదువుతోంది.
26నుంచి రెండు రాష్ట్రాల స్థాయి కబడ్డీ పోటీలు
చింతకాని: మహాశివరాత్రి సందర్భంగా ఈనెల 26నుంచి మండలంలోని నేరడలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల స్థాయి కబడ్డీ పోటీలు నిర్వహించనున్నారు. ఈ పోటీలు మూడు రోజు ల పాటు జరుగుతాయని నేతాజీ యువజన సంఘం కార్యదర్శి దూసరి గోపాలరావు మంగళవా రం ఒక ప్రకటనలో తెలిపారు. జట్ల బాధ్యులు రూ.500 ఎంట్రీ ఫీజు చెల్లించి ఈనెల 25వ తేదీ లోగా నమోదు చేసుకోవాలని సూచించారు. మొదటి మూడు స్థానాల్లో నిలిచేవారికి వరుసగా రూ.50 వేలు, రూ.40 వేలు, రూ.30వేలతో పాటు ఎనిమిదో స్థానం వరకు నిలిచే జట్లకు సై తం నగదు బహుమతులు అందజేస్తామని తెలి పారు. వివరాలకు 70939 00119, 93945 71739, 80084 92173 ఫోన్ నంబర్లలో సంప్రదించాలని ఆయన సూచించారు.
సత్యనారాయణపురంలో చోరీ
చర్ల: మండలంలోని సత్యనారాయణపురంలో ఓ ఇంట్లో చోరీ జరిగింది. గ్రామంలోని ప్రధాన రహదారి పక్కన ఎన్.రాముకు చెందిన ఇంట్లో ఎవ్వరూ లేని సందర్భంలో దొంగలు చొరబడి బీరువాను ధ్వంసం చేశారు. తలుపులు తెరిచి ఉండడాన్ని ఇంటి పక్కవారు గుర్తించి హైదరాబాద్‌లో ఉన్న కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వడంతో వారు పోలీసులకు విషయం చెప్పారు. సీఐ రాజువర్మ, ఎస్‌ఐలు నర్సిరెడ్డి, కేశవ్ ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. ఏ మేరకు చోరీ జరిగిందనే విషయం కుటుంబ సభ్యులు వస్తే తెలుస్తుందని పోలీసులు చెప్పారు. క్లూస్‌టీం కూడా వచ్చి ఇంటి పరిసరాలను పరిశీలించింది. ఆదివారం రాత్రి మండల కేంద్రంలోని జ్యూయలరీ దుకాణాల్లో దొంగలు చొరబడి చోరీకి పాల్పడగా అదేరోజు ఈ ఘటన జరిగిందా? తరువాత రోజు జరిగిందా? అనే దానిపై పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.
మిట్టగూడెంలో..
అశ్వాపురం: మండలంలోని మిట్టగూడెం గ్రా మంలో ఒంకోజు బ్రహ్మచారి ఇంట్లో సోమవారం రాత్రి చోరీ జరిగింది. బ్రహ్మచారి కుటుంబ సభ్యులు సూర్యా పేట జాతరకు వెళ్లగా రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ఇంటి తాళాలు పగులగొట్టి ఇంట్లో చొరబడి చోరీ చేశారు. ఏమేమి పోయాయో తెలియాల్సి ఉంది.
ఇంటి నిర్మాణానికి అడ్డుకట్ట
ఇంటి నిర్మాణానికి అడ్డుకట్ట
Comments
Please login to add a commentAdd a comment