చికిత్స పొందుతున్న బస్ క్లీనర్ మృతి
జూలూరుపాడు: రోడ్డు ప్రమాదంలో గాయపడిన బస్ క్లీనర్ దేశబోయిన శ్రీనివాస్ (56) కొత్తగూడెం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం రాత్రి మృతి చెందాడు. జూలూరుపాడు ఎస్‌ఐ బి.రవి కథనం మేరకు.. చుంచుపల్లి మండలం రాంనగర్‌కు చెందిన శ్రీనివాస్ కొత్తగూడెంలోని ఓ ప్రైవేట్ స్కూల్ బస్‌క్లీనర్ (హెల్పర్)గా పనిచేస్తున్నాడు. ఈనెల 13న విద్యార్థులను ఇళ్ల వద్ద దింపేందుకు జూలూరుపాడు మండలం పడమటనర్సాపురం వచ్చిన శ్రీనివాస్.. బస్‌లో నుంచి విద్యార్థులను దింపుతుండగా టాటా ఏస్ వాహనం వచ్చి ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిన ఆయనను కొత్తగూడెం ఆస్పత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ సోమవారం రాత్రి మృతి చెందాడు. మృతుడికి భార్య రాజకుమారి, కుమార్తె యమున ఉన్నారు. యమున ఫిర్యాదు మేరకు టాటా ఏస్ వాహనం డ్రైవర్ కుర్రం రాజుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ రవి పేర్కొన్నారు.
న్యాయం చేయాలని మృతదేహంతో ఆందోళన..
చుంచుపల్లి: శ్రీనివాస్ కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ మృతదేహంతో పాఠశాల వద్ద ఆందోళన చేసేందుకు వెళ్తున్న క్రమంలో పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ప్రధాన రహదారిపైనే ఆటోలో మృతదేహాన్ని ఉంచి కుటుంబ సభ్యులు ఆందోళన చేశారు. చుంచుపల్లి, జూలూరుపాడు ఎస్‌ఐలు జోక్యం చేసుకొని ఆందోళన విరమించాలని చెప్పినా కుటుంబ సభ్యులు నిరాకరించారు. న్యాయం చేసే వరకు వెళ్లేది లేదంటూ భీష్మించారు. పాఠశాల యాజమాన్యం స్పందించి మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలని పలువురు ఆందోళనకు మద్దతు ప్రకటించారు. ఆ తర్వాత పాఠశాల వద్ద కూడా మృతదేహంతో ఆందోళన చేశారు. దీంతో స్థానిక పెద్దలు జోక్యం చేసుకుని పాఠశాల యాజమాన్యంతో మాట్లాడగా, శ్రీనివాస్ కుటుంబానికి న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.
చికిత్స పొందుతున్న బస్ క్లీనర్ మృతి
Comments
Please login to add a commentAdd a comment