రెండు ఇసుక ట్రాక్టర్లు సీజ్
అశ్వారావుపేటరూరల్: అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్లను మంగళవారం తెల్లవారుజామున కొత్తగూడెం స్పెషల్ బ్రాంచ్ పోలీసులు అశ్వారావుపేట శివారులో పట్టుకున్నారు. ఎస్‌ఐ యయాతి రాజు కథనం ప్రకారం.. మండలంలోని అనంతారం గ్రామ శివారులోని వాగు నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా ఇసుక తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను ఎస్‌బీ పోలీసులు పట్టుకొని పోలీస్‌స్టేషన్ తరలించారు. రెండు ట్రాక్టర్లను సీజ్ చేసి, డ్రైవర్లు అరవింద్, రాముపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
సంగం గ్రామంలో ఇసుక ట్రాక్టర్...
పాల్వంచరూరల్: అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్‌ను పోలీసులు పట్టుకున్నారు. మండలంలోని సంగం గ్రామంలో మొర్రేడు వాగు నుంచి ఇసుకను తరలిస్తుండగా మంగళవారం ఎస్‌ఐ సురేశ్ పట్టుకున్నారు. ట్రాక్టర్ డ్రైవర్ నాగమళ్ల రవి, యజమాని పాకల వెంకట్రావుపై కేసు నమోదు చేశామని ఎస్‌ఐ తెలిపారు.
ట్రాక్టర్, జేసీబీ పట్టివేత
జూలూరుపాడు: మండలంలోని కరివారిగూడెం సమీపంలోని పెద్దవాగు నుంచి ఇసుకను అక్రమంగా తవ్వి, తరలిస్తున్న జేసీబీ, ట్రాక్టర్‌ను పోలీసులు మంగళవారం పట్టుకున్నారు. మండలంలోని కొమ్ముగూడెం గ్రామానికి చెందిన భూక్యా సక్రాం ఎలాంటి అనుమతి లేకుండా జేఏసీబీతో ఇసుక తవ్వి.. ట్రాక్టర్‌లో తరలిస్తుండగా పోలీసులు వాహనాలను పట్టుకొని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. భూక్యా సక్రాం, ట్రాక్టర్ యజమాని భూక్యా కిషన్, డ్రైవర్ భూక్యా జశ్వంత్, సుజాతనగర్‌కు చెందిన జేసీబీ యజమాని టి.రమేశ్‌తోపాటు రాచబండ్లకోయగూడెంనకు చెందిన జేసీబీ డ్రైవర్ పద్దం హరిపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ రవి వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment