కారేపల్లి: కారేపల్లిలో బీసీ బాలుర వసతి గృహం నిర్మాణానికి ప్రభుత్వ స్థలాన్ని కేటాయించగా, నిధులు కూడా మంజూరయ్యాయి. అయితే, ఈ స్థలంలో ఏర్పాటుచేసిన బోర్డును కొందరు తొలగించడం, అక్కడ గద్దెల నిర్మించడంతో బీసీ సంక్షేమ శాఖ డివిజనల్ అధికారి ఈదయ్య గురువారం పరిశీలించా రు. స్థల ఆక్రమణకు యత్నిస్తే చర్యలు తీసుకుంటా మని తెలిపారు. ఈవిషయమై తహసీల్దార్ సంపత్‌కుమార్‌కు, పోలీసులకు ఫిర్యాదు చేశామని వెల్లడించారు. త్వరలోనే హాస్టల్‌కు కేటాయించిన స్థలానికి ఫెన్సింగ్ ఏర్పాటు చేస్తామని తెలిపారు.
బైక్ అదుపు తప్పి యువకుడికి గాయాలు
దమ్మపేట: అతివేగంతో ప్రయాణిస్తున్న బైక్ అదుపు తప్పి ప్రమాదం జరిగిన ఘటనలో ఓ యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల కథనం ప్రకారం... గురువారం రాత్రి అన్నపురెడ్డిపల్లి మండలం బుచ్చన్నగూడెం గ్రామానికి చెందిన కొండ్రు రమేష్(27) మందలపల్లి నుంచి సత్తుపల్లి వైపు బైక్‌పై వెళ్తున్నాడు. ఈ క్రమంలో గట్టుగూడెం శివారులో బైక్ అదుపుతప్పి పొదల్లోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో రమేష్‌కు తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రుడిని 108 అంబులెన్స్ ద్వారా సత్తుపల్లి ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment