మాస్టర్ ప్లాన్ సర్వే పాయింట్ల గుర్తింపు
పాల్వంచ: మున్సిపాలిటీలో జియో మాస్టర్ ప్లాన్ సర్వే పాయింట్లను అధికారులు గుర్తిస్తున్నారు. ఇప్పటివరకు 34 చోట్ల పాయింట్లను ఎంపిక చేశారు. ఈ ప్రక్రియను గురువారం మున్సిపల్ కమిషనర్ కె.సుజాత పరిశీలించి మాట్లాడారు. త్వరలోనే డ్రోన్ కెమెరాల ద్వారా పట్టణ స్థితిగతులను గుర్తిస్తామని తెలిపారు. భవిష్యత్‌లో పట్టణ మాస్టర్ ప్లాన్ తయారు చేసేందుకు ఈ సర్వే ఉపయోగపడుతుందన్నారు. అనంతరం కరకవాగు ఫిల్టర్ బెడ్‌ను పరిశీలించారు. నీటిశుద్ధి చేయాలని సిబ్బందిని ఆదేశించారు. పాత పాల్వంచ చింతల చెర్వు కట్టపై పారిశుద్ధ్య పనులు పరిశీలించి చెరువు పొడువునా వాకర్లకు ఇబ్బందులు లేకుండా పరిశుభ్రంగా ఉంచాలన్నారు. కమిషనర్ వెంట టీపీఓ నవీన్, సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment