కుటీర పరిశ్రమలతో స్వయం ఉపాధి
భద్రాచలం: గిరిజన నిరుద్యోగ యువత కుటీర పరిశ్రమలు ఏర్పాటుచేసుకుని స్వయం ఉపాధి పొందడం ద్వారా ఆర్థికాభివృద్ధి సాదించాలని ఐటీడీఏ పీఓ బి.రాహుల్ సూచించారు. ఆళ్లపల్లి మండలానికి చెందిన నలుగురు రూ.25లక్షల విలువైన శ్రీ ధనలక్ష్మి ఫ్లైయాష్ బ్రిక్స్ యూనిట్ ను ఏర్పాటుచేసుకోగా రూ.15లక్షల సబ్సిడీ మంజూరైంది. ఈ మేరకు సభ్యులకు సబ్సిడీ చెక్కును గురువారం ఆయన భద్రాచలంలోని ఐటీడీఏ కార్యాలయంలో అందజేశారు. అనంతరం ఇటుకలు తయారీ, ముడి సరుకుల సేకరణ, మార్కెటింగ్‌పై ఆరా తీశాక మాట్లాడారు. నిరుద్యోగ యువత ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రయత్నిస్తూనే సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమలు ఏర్పాటు చేసుకుంటే స్వయం ఉపాధి లభించడమే కాక ఇంకొందరికి చేయూతనివ్వవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏపీఓ జనరల్ డేవిడ్‌రాజ్, జేడీఎం హరికృష్ణ, యూనిట్ సభ్యులు సుశీల, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
సమష్టి కృషితో పరిశ్రమల్లో రాణింపు
భద్రాచలం: యువతీ, యువకులు సూక్ష్మ పరిశ్రమలను ఏర్పాటుచేసుకుని సమష్టిగా కృషి చేస్తే విజయం సొంతమై జీవితంలో రాణించవచ్చని సీఐఓటీ డైరెక్టర్ ఉదయ్‌కుమార్ తెలిపారు. భద్రాచలంలోని వైటీసీలో సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టూల్స్ డిజైన్ ఆధ్వర్యాన ఎంఎస్‌ఎంఈ యూనిట్ల సభ్యులకు ఇస్తున్న మూడు రోజుల శిక్షణ గురువారం ముగిసింది. ఈసందర్భంగా ఉదయ్కుమార్ మాట్లాడుతూ ఎంచుకున్న రంగంపై పూర్తి అధ్యయనం చేశాక పరిశ్రమలు ఏర్పాటుచేయాలని, నాణ్యమైన వస్తువుల తయారీతో పాటుగా మార్కెటింగ్‌పై పట్టు సాధించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జేడీఎం హరికృష్ణ, సీఐఓటీ శిక్షకుడు విజయ్‌కుమార్, భవిత సెల్ సిబ్బంది మణికుమారి, సమ్మయ్య, దినేష్ పాల్గొన్నారు.
ఉత్సాహంగా క్రీడా పోటీలు
అశ్వారావుపేటరూరల్: వ్యవసాయ కళాశాలలో విశ్వవిద్యాలయ స్థాయిలో బోధన సిబ్బందికి నిర్వహిస్తున్న క్రీడా పోటీలు గురువారం ఉత్సాహంగా సాగాయి. రాష్ట్రంలోని 9 వ్యవసాయ కళాశాలల నుంచి బోధన సిబ్బంది పోటీలకు హాజరయ్యారు. గురువారం రెండో రోజు వాలీబాల్, చెస్, బాల్ బ్యాడ్మింటన్, టేబుల్ టెన్నిస్, షటిల్, క్యారంబోర్డు, క్రికెట్ పోటీలు నిర్వహించారు. పోటీలను కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ హేమంత్ కుమార్, ఫ్రొఫెసర్లు డాక్టర్ శ్రావణ్ కుమార్, డాక్టర్ శీరిష, డాక్టర్ మధుసూదన్‌రావు పర్యవేక్షించారు.
నేడు ఉమ్మడి జిల్లాస్థాయి రెజ్లింగ్ పోటీలు
కొత్తగూడెంటౌన్: ఉమ్మడి ఖమ్మం జిల్లా స్థాయి రెజ్లింగ్ పోటీలు శుక్రవారం కొత్తగూడెం రామవరంలోని తెలంగాణ క్రీడా మైదానంలో నిర్వహించనున్నట్లు రెజ్లింగ్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి పి.కాశీహుస్సేన్ తెలిపారు. అండర్–10, 12, 14, 17 విభాగాల్లో ఈ పోటీలు జరుగుతాయని వెల్లడించారు. ఆసక్తి కలిగిన బాలబాలికలు వయస్సు ధ్రువీకరణ పత్రం, ఆధార్‌కార్డుతో రావాలని సూచించారు.
ఖమ్మం, కల్లూరు, మణుగూరు జట్ల విజయం
ఖమ్మం స్పోర్ట్స్: ఖమ్మం సర్దార్ పటేల్ స్టేడియంలో కొనసాగుతున్న రాజీవ్‌గాంధీ స్మారక క్రికెట్ టోర్నీలో భాగంగా గురువారం నిర్వహించిన మ్యాచ్‌ల్లో ఖమ్మంఅర్బన్, కల్లూరు, మణుగూరు జట్లు ముందంజలో నిలిచాయి. ఖమ్మం అర్బన్ – వైరా జట్ల నడుమ మ్యాచ్‌లో అర్బన్ జట్టు నిర్ణీత ఓవర్లలో 112 పరుగులు చేయగా తర్వాత బ్యాటింగ్‌కు దిగిన వైరా 107 పరుగులే చేయడంతో ఓటమిపాలైంది.కల్లూరు–ముదిగొండ మధ్య మ్యాచ్‌లో ముదిగొండ జట్టు 77పరుగులు చేయగా, కల్లూరు జట్టు ఆరు వికెట్ల తేడాతో ఘనవిజ యం సాధించింది. అలాగే, మూడో మ్యాచ్‌లో మణుగూరు–సత్తుపల్లి తలపడగా తొలుత బ్యా టింగ్‌కు దిగిన మణుగూరు జట్టు 113 పరుగులకు ఆలౌట్ అయింది. ఆతర్వాత సత్తుపల్లి 106 పరుగులకే ఆలౌట్ కావడంతో మణుగూరుకు విజయం దక్కింది. ఈమేరకు పోటీలను టోర్నీ ఆర్గనైజర్ ఎం.డీ.మతిన్ పర్యవేక్షించారు.
కుటీర పరిశ్రమలతో స్వయం ఉపాధి
కుటీర పరిశ్రమలతో స్వయం ఉపాధి
Comments
Please login to add a commentAdd a comment