నకిలీ టీఆర్‌లతో దందా
అశ్వాపురం: మండల పరిధిలోని నెల్లిపాకలో సీసీఐ కొనుగోళ్లలో నకిలీ టీఆర్ లతో వ్యాపారులు రైతుల పేర్లతో భారీగా పత్తి అమ్మకాలు సాగించారు. రైతుల వద్ద తక్కువ ధరకు కొనుగోలు చేసి నకిలీ టీఆర్‌లతో సీసీఐలో అమ్మకాలు జరిపి భారీగా సొమ్ము చేసుకున్నారు. నెల్లిపాక సీసీఐ కేంద్రంగా సాగిన ఈ దందా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అశ్వాపురం, బూర్గంపాడు మండలాల్లోని సీసీఐ కొనుగోలు కేంద్రాల్లో నకిలీ టీఆర్‌ల వ్యవహారం ఇటీవల విజిలెన్స్ విచారణలో వెలుగుచూసింది. విజిలెన్స్ అధికారులు వ్యవసాయ శాఖ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లగా విచారణకు ఆదేశించారు. వ్యవసాయ శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టి నకిలీ టీఆర్‌లను గుర్తించారు. వీటి మంజూరుకు అశ్వాపురం మండలంలో పని చేస్తున్న ఏఈఓ ప్రధాన సూత్రదారిగా, కమీషన్ల కోసం నకిలీ జిరాక్స్‌లతో వ్యాపారులకు ఇష్టానుసారంగా నకిలీ టీఆర్‌లు ఇచ్చారని నిర్ధారించి ఉన్నతాధికారులకు నివేదిక అందజేశారు. త్వరలోనే ఏఈఓపై సస్పెన్షన్ వేటు పడుతుందని భావించారు. ఈ వ్యవహారంలో భద్రాచలం వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యదర్శి ఎన్.శ్రీనివాసరావుపై సస్పెన్షన్ వేటు వేశారు. తాజాగా టీఆర్ కోసం ఓ రైతు వద్ద రూ.30 వేలు లంచం తీసుకుంటూ అశ్వాపురం మండల వ్యవసాయ అధికారి సాయిశంతన్‌కుమార్ గురువారంఏసీబీ అధికారులకు పట్టుపడ్డారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి నెల్లిపాక సీసీఐ కేంద్రంలో నకిలీ టీఆర్‌లపై పూర్తి స్థాయిలో ఏసీబీ అధికారులతో విచారణ జరిపించాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానిక రైతులు కోరుతున్నారు.
నెల్లిపాక సీసీఐ కేంద్రంగా రైతుల పేరుతో వ్యాపారుల పత్తి అమ్మకాలు
ఇటీవల భద్రాచలం మార్కెట్ కమిటీ కార్యదర్శి సస్పెన్షన్
తాజాగా లంచం డిమాండ్ చేసి ఏసీబీకి చిక్కిన అశ్వాపురం ఏఓ
Comments
Please login to add a commentAdd a comment