ఏసీబీకి చిక్కిన ఏఓ..
అశ్వాపురం: పత్తి విక్రయించేందుకు టీఆర్ కోసం వచ్చిన రైతు నుంచి లంచం తీసుకుంటుండగా మండల వ్యవసాయ అధికారి సాయిశంతన్‌కుమార్‌ను గురువారం ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఏసీబీ డీఎస్పీ వై.రమేష్ కథనం ప్రకారం.. మండలానికి చెందిన ఓ రైతు పత్తి అమ్మేందుకు టీఆర్ కోసం ఏఓ వద్దకు వెళ్లగా రూ.30 వేలు డిమాండ్ చేశాడు. దీంతో రైతు ఏసీబీని ఆశ్రయించాడు. ఏసీబీ అధికారుల సూచనల ప్రకారం రైతు వ్యవసాయ శాఖ కార్యాలయానికి వెళ్లి, ఏఓ సూచనల మేరకు డబ్బులు బ్యాగ్‌లో పెట్టాడు. అదే సమయంలో ఏసీబీ అధికారులు వచ్చి నగదు స్వాధీనం చేసుకున్నారు. ఏఓను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. మండల వ్యవసాయ అధికారిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి కోర్టుకు తరలించనున్నట్టు డీఎస్పీ తెలిపారు. కాగా ఫిర్యాదుదారుడి పేరు ఏసీబీ అధికారులు వెల్లడించలేదు. ఎవరైనా లంచాలు అడిగితే టోల్‌ఫ్రీ నంబర్ 1064కు సమాచారం ఇవ్వాలని డీఎస్పీ తెలిపారు. ఈ దాడుల్లో ఏసీబీ డీఎస్పీ వై.రమేష్, సీఐలు శేఖర్, సట్ల రాజు, సిబ్బంది పాల్గొన్నారు.
ఏఓపై కుట్ర చేశారని ఆరోపణలు
ఏఓపై కుట్ర పన్నారని సామాజిక మాధ్యమాల్లో కొందరు పోస్టులు పెట్టడం గమనార్హం. సీసీఐ కేంద్రంగా జరిగిన నకిలీ టీఆర్‌ల దందాకు సహకరించలేదని కుట్ర పన్ని ఏసీబీ అధికారులకు పట్టించారని, దీనిపై సమగ్ర న్యాయ విచారణ జరిపించాలని రాజకీయపార్టీల నాయకులు, రైతులు, స్థానికులు కోరుతున్నారు.
రైతు వద్ద రూ.30 వేలు తీసుకుంటూ
పట్టుబడ్డ అధికారి
Comments
Please login to add a commentAdd a comment