● రైల్వే అధికారులకు ఏడీఎం గోపాలకృష్ణయ్య సూచన ● పలు అభివృద్ధి పనుల తనిఖీ
కొత్తగూడెంఅర్బన్: భద్రాచలం రోడ్డు రైల్వే స్టేషన్, ఆవరణలో జరుగుతున్న అభివృద్ధి పనులను సౌత్ సెంట్రల్ రైల్వే అడిషనల్ డివిజనల్ మేనేజర్ గోపాలకృష్ణయ్య గురువారం తనిఖీ చేశారు. పనులకు సంబంధించి స్థానిక అధికారులకు కొన్ని సూచనలు చేశారు. అనంతరం మాట్లాడుతూ.. ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా త్వరితగతిన పనులు పూర్తి చేయాలని అన్నారు. స్టేషన్‌లో తనిఖీ అనంతరం ఏడీఎంతో పాటు సెంట్రల్ రైల్వే డీఆర్‌యూసీసీ మెంబర్ వై.శ్రీనివాస్‌రెడ్డిని పట్టణానికి చెందిన పలువురు కలిసి వినతిపత్రం అందజేసి మాట్లాడారు. బెళగావి ఎక్స్‌ప్రెస్‌తో పాటు కొత్తగూడెం నుంచి డోర్నకల్ వెళ్లే ప్యాసింజర్ రైలును పునరుద్ధరించాలని, కొత్తగూడెం కేంద్రంగా రైల్వే జంక్షన్ ఏర్పాటు చేయాలని కోరారు. పుణ్యక్షేత్రాలైన తిరుపతి, షిరిడీ, భద్రాచలం ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లు నడపాలని, కొత్తగూడెం – సికింద్రాబాద్ కాకతీయ ఎక్స్‌ప్రెస్‌లో జనరల్ బోగీలతో పాటు రిజర్వేషన్ బోగీలు ఏర్పాటు చేయాలని కోరారు. రెండేళ్లుగా నత్తనడకన సాగుతున్న రైల్వే స్టేషన్ అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment