● బొగ్గు ఉత్పత్తి సాధనకు ఐక్యంగా కృషి చేయాలి ● సంస్థ అభివృద్ధికి శక్తి వంచన లేకుండా పని చేస్తా ● సింగరేణి డైరెక్టర్ వెంకటేశ్వర్లు
సింగరేణి(కొత్తగూడెం): కొత్తగూడెం ఏరియాలోని వీకే –7 బొగ్గు గనికి మార్చి రెండో వారంలో పర్యావరణ అనుమతులు వస్తాయని, ఆ వెంటనే ఓబీ పనులు ప్రారంభిస్తామని సింగరేణి డైరెక్టర్(పీపీ) కె.వెంకటేశ్వర్లు తెలిపారు. డైరెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా గురువారం ఆయన కొత్తగూడెంలో విలేకరులతో మాట్లాడారు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో సంస్థ నిలదొక్కుకోవాలంటే ఇతర దేశాల వలె తక్కువ ధరకు నాణ్యమైన బొగ్గు సరఫరా చేయాల్సి ఉందని, అందుకోసం ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించుకోవాలని సూచించారు. సంస్థ బీఐఎఫ్‌ఆర్‌లోకి వెళ్లినప్పుడు నాటి కార్మికులు కష్టపడి పనిచేసి తిరిగి నిలబెట్టారని, ప్రస్తుత కార్మికులో ఆ పటిమ లేదని అన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో 72 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి చేయడం లక్ష్యం కాగా, కొంత వెనుకంజలో ఉన్నామని, మిగిలిన 40 రోజుల్లో లక్ష్య సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. సంస్థ అభివృద్ధి, వ్యాపార విస్తరణ కోసం శక్తివంచన లేకుండా కృషి చేస్తానని చెప్పారు. వీకే–7తో పాటు జేకే ఓసీ, గోలేటి, రొంపేడు ఓసీల అనుమతుల సాధనే లక్ష్యంగా పని చేస్తానన్నారు. రక్షణ సూత్రాలు పాటిస్తూ, కంపెనీని ప్రమాద రహితంగా తీర్చిదిద్దాలని కార్మికులు, ఉద్యోగులకు సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment