అపార్ ఐడీ ప్రక్రియ పూర్తి చేయాలి
అశ్వారావుపేటరూరల్: విద్యార్థుల అపార్ ఐడీ ప్రక్రియను సకాలంలో పూర్తి చేయాలని ప్లానింగ్ కో ఆర్డినేటర్ సతీష్ అన్నారు. జిల్లా అధికారుల బృందం గురువారం అశ్వారావుపేట, తిరుమలకుంట కాలనీ, మామిళ్లవారిగూడెం పాఠశాలలను సందర్శించి, ఆయా పాఠశాలల్లో అపార్ ఐడీ నమోదు వివరాలను పరిశీలించింది. అనంతరం స్థానిక ఎంఈఓ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో సతీష్ మాట్లాడుతూ.. అపార్ ఐడీ నమోదును వేగవంతం చేయాలన్నారు. నమోదుపై సందేహాలను నివృత్తి చేశారు. అనంతరం నారాయణపురం కాంప్లెక్స్‌లో జరిగిన బాలమేళా కార్యక్రమంలో పాల్గొని, ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు, సర్టిఫికెట్లు అందించారు. కార్యక్రమాల్లో జిల్లా బృందం సభ్యులు నాగరాజశేఖర్, సైదులు, ఎంఈఓ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment