అంత్యక్రియలకు రూ.50వేల ఆర్థికసాయం
మణుగూరు టౌన్: నిరుపేద యువతి అంత్యక్రియలు పూర్తి చేసేందుకు రూ. 50 వేలు ఆర్థికసాయం అందించి దాతలు మానవత్వం చాటుకున్నారు. ముత్యాలమ్మనగర్‌కి చెందిన ఎం.శాంతి(24) అనారోగ్యంతో బుధవారం సాయంత్రం మృతి చెందింది. నిరుపేద కుటుంబం కావడంతో తల్లిదండ్రుల వద్ద అంత్యక్రియలకు డబ్బు లేక ఇంటి ఆరుబయటే మృతదేహాన్ని ఉంచి రోదిస్తున్నారు. దయనీయ దృశ్యాన్ని గమనించిన చంద్రశేఖర్ అనే వ్యక్తి సామాజిక మాధ్యమంలో పోస్టు చేయగా, జిల్లాలోని పలువురు ఆ కుటుంబానికి ఆర్థికసాయం అందించి అండగా నిలిచారు. ఒక్కొక్కరు రూ. 500 నుంచి రూ. 5 వేల వరకు ఫోన్ పే ద్వారా విరాళం అందించారు. రూ.50 వరకు సాయం అందింది.
Comments
Please login to add a commentAdd a comment