వేతనం రూ.300 వచ్చేలా చూడాలి
దుమ్ముగూడెం : ఉపాధి హామీ కూలీలకు రోజు వారీ వేతనం రూ.300 వచ్చేలా పని కల్పించాలని జిల్లా గ్రామీణభివృద్ధి అధికారి, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యాచందన సిబ్బందికి సూచించారు. గురువారం మండలంలోని బట్టిగూడెం, మహాదేవ పురం గ్రామపంచాయతీల్లో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో చేపట్టిన ఫామ్‌పాండ్స్, మునగ తోట పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పని ప్రదేశాల వద్ద నీడ, తాగునీటి సౌకర్యాలు కల్పించాలని, ఓఆర్‌ఎస్ పాకెట్లు అందుబాటులో ఉంచాలని ఆదేవించారు. తాగునీటి సమస్య ఉందని కూలీలు ఆమె దృష్టికి తేగా, వెంటనే ఎంపీడీఓ రామకృష్ణ, మిషన్ భగీరథ ఇంజనీర్లలను ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో ఏపీఓ సుకన్య, ఈసీలు అప్పారావు, రాజు, టీఏ వెంకటేష్, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment