వీరు పూర్వ విద్యార్థులే!
పెనుబల్లి : అందరి వయ స్సు 75 ఏళ్లు దాటింది. ఉద్యోగ, వ్యాపారాల రీత్యా వివిధ ప్రాంతాల్లో స్థిరపడిన వీరి పిల్లలు చేతికి రావడంతో మనవళ్లు, మనవరాళ్లతో శేషజీవితం గడుపుతున్నారు. అయితే, నాటి పెనుబల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల.. ప్రస్తుత వీఎం బంజర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 1965–64లో వీరందరూ 11వ తరగతి(హెచ్‌ఎస్‌సీ) చదివారు. పాఠశాలలో వీరికి రెండో బ్యాచ్‌గా 11మంది ఉండేవారు. ఇందులో తొమ్మిది మంది ఇటీవల కలుసుకోవాలని నిర్ణయించుకుని గురువారం పాఠశాలకు చేరుకుని ఆనాటి స్మృతులను గుర్తు చేసుకున్నారు. చదువు చెప్పిన గురువులు, తమను వీడిపోయిన మిత్రులను స్మరించుకున్నారు. పాఠశాల ఏర్పాటుకు కృషి చేసిన దివంగత సీఎం వెంగళరావు సేవలను కొనియాడారు. ఆనాటి విద్యార్థులైన వంగా నరసింహాస్వామి, ఏటుకూరి రామారావు, కాటోజు మునేశ్వరరావు, బజ్జూరి వెంకటేశ్వరరావు, దామెర ప్రసాద్‌రావు, పోలకంపల్లి ధనుంజయ్‌రావు, సోమరాజు నాగభూషణ్‌రావు, ఏటుకూరి చిన్న కృష్ణారావు, వంగల రంగాచారి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment