టీచర్ ఎమ్మెల్సీగా నర్సిరెడ్డి గెలుపు ఖాయం
టేకులపల్లి: ఖమ్మం – నల్లగొండ – వరంగల్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా మరోమారు అలుగుబెల్లి నర్సిరెడ్డి గెలుపు ఖాయమని టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు చావా రవి ధీమా వ్యక్తం చేశారు. పోలింగ్ సందర్భంగా టేకులపల్లిలో గురువారం పోలింగ్ కేంద్రాల వద్ద ఆయన ఉపాధ్యాయులను కలిసి మాట్లాడారు. గత ఆరేళ్లలో ఉపాధ్యాయులు, సీఆర్టీలు, అధ్యాపకుల సమస్యల పరిష్కారం కోసమే కాక విద్యారంగ అభివృద్ధికి నర్సిరెడ్డి కృషి చేశారని తెలిపారు. తద్వారా మరోమారు ఆయనను గెలిపించాలని ఉపాధ్యాయులు నిర్ణయించుకున్నారని చెప్పారు. ఉద్యమ సంఘాలైన టీఎస్ యూటీఎఫ్, టీపీటీఎఫ్ బాధ్యలంతా ఇందుకోసం కృషి చేశారని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీపీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు జి.హరిలాల్‌నాయక్‌తో పాటు టీపీటీఎఫ్, టీఎస్ యూటీఎఫ్ బాధ్యులు బి.కిషోర్‌సింగ్, వి.వరలక్ష్మి, బి.మాన్‌సింగ్, డి.హరికుమార్, బి.రామరాజు, రేపాకుల శ్రీనివాస్, ఎం.డీ.మౌలానా, టి.బిక్షమయ్య, వి.కాంతారావు, గుమ్మడి కృష్ణవేణి, మంజీలాల్, బి.వీరన్న, కడుదుల వీరన్న, ఈసం నర్సింహారావు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment