మ్యూజియంను ఆకర్షణీయంగా తీర్చిదిద్దాలి
భద్రాచలంటౌన్: భద్రాచలం ఐటీడీఏ ప్రాంగణంలోని ట్రైబల్ మ్యూజియాన్ని పర్యాటకులను ఆకర్షించేలా తీర్చిదిద్దాలని ఐటీడీఏ పీఓ బి.రాహుల్ సూచించారు. మ్యూజియం కమిటీ సభ్యులతో కలిసి ఆయన గురువారం మ్యూజియం పరిసరాల్లో ఏర్పాటు చేస్తున్న బాక్స్ క్రికెట్ గ్రౌండ్‌తోపాటు బోటింగ్ కోసం సిద్ధం చేసిన చెరువును పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మార్చి 10వ తేదీలోగా పనులు పూర్తి కావాలని చెప్పారు. అన్ని గిరిజన తెగల ఆచార వ్యవహారాలు, కట్టుబాట్లు, సంస్కృతీ సంప్రదాయాలకు సంబంధించిన బుక్‌లెట్ తయారు చేయించాలని, కోయ భాషలో స్వాగతం పలికే పెయింటింగ్ వేయించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏపీఓ డేవిడ్ రాజ్, ఉదయభాస్కర్, ప్రభాకర్ రావు, హరీష్, హరికృష్ణ, గోపాల్ రావు, వీరస్వామి తదితరులు పాల్గొన్నారు.
గిరిజన రైతులు ఆర్థికాభివృద్ధి సాధించాలి
అశ్వాపురం: గిరిజన రైతులు ప్రభుత్వ పథకాలు సద్వినియోగం చేసుకుని ఆర్థికాభివృద్ధి సాధించాలని ఐటీడీఏ పీఓ బి.రాహుల్ సూచించారు. మండల పరిధిలోని చింతిర్యాలగూడెంలో విఘ్నేశ్వర రైతు ఉత్పత్తి దారుల సంఘం గోదాంను గురువారం ఆయన సందర్శించారు. యంత్ర పరికరాలు అందజేయాలని రైతులు ఈ సందర్భంగా పీఓను కోరారు. అనంతరం పీఓ మాట్లాడుతూ అశ్వాపురంలో 550 మెట్రిక్ టన్నుల గోదాం ఉన్నందున రైతులు సక్రమంగా వినియోగించుకోవాలన్నారు. నాబార్డు, ఐటీడీఏ సహకారంతో అందించిన ట్రాక్టర్, యంత్ర పరికరాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. పంటలపై మందులు చల్లేందుకు స్ప్రే డ్రోన్ యంత్రం మంజూరుకు కృషి చేస్తామన్నారు.
ఐటీడీఏ పీఓ రాహుల్
Comments
Please login to add a commentAdd a comment