కొత్తగూడెంఅర్బన్: డీఎస్సీ–2024 ద్వారా నియమితులైన 258 మంది ఎస్‌జీటీ ఉపాధ్యాయులకు శుక్రవారం నుంచి మార్చి 3వ తేదీ వరకు మూడు రోజులపాటు వృత్యంతర శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు డీఈఓ ఎం.వెంకటేశ్వరాచారి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. నూతన విద్యా విధానంలో పిల్లలకు తరగతి గదిలో బోధన, అభ్యసన కృత్యాలు ఎలా సాగించాలి, వర్క్ బుక్, పాఠ్యపుస్తకాలు ఉపయోగించే విధానం, బహుళ తరగతి బోధన, పరీక్షా విధానాలు తదితర అంశాలపై శిక్షణ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. జిల్లా నుంచి 12 మంది జిల్లా రిసోర్స్‌పర్సన్‌లు ఈ నెల 21, 22 తేదీల్లో హైదరాబాద్‌లో జరిగిన శిక్షణ కార్యక్రమానికి హాజరై వచ్చారని తెలిపారు. వారు ఉపాధ్యాయులకు శిక్షణ ఇస్తారని పేర్కొన్నారు. శిక్షణా కార్యక్రమానికి అందరూ తప్పనిసరిగా హాజరుకావాలని వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment