స్వర్ణకవచధారణలో రామయ్య
భద్రాచలం: భద్రాచల శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానం అంతరాలయంలోని మూలమూర్తులు శుక్రవారం స్వర్ణ కవచధారులై దర్శనమిచ్చారు. నిత్యకల్యాణానికి బేడా మండపంలో కొలువుదీరిన స్వామివారికి విష్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా జరిపారు. శ్రీ లక్ష్మీతాయారు అమ్మవారి ఆలయంలో అభిషేకం, పూజలు చేశారు
పెద్దమ్మతల్లికి
పంచామృతాభిషేకం
పాల్వంచరూరల్: పెద్దమ్మతల్లి అమ్మవారికి శుక్రవారం వైభవంగా పంచామృతాభిషేకం నిర్వహించారు. అర్చకులు అమ్మవారి జన్మస్థలం వద్ద పంచామృతం, పసుపు, కుంకుమ, గాజులు, హారతి సమర్పించారు. అనంతరం ఆలయంలోని మూలవిరాట్‌కు పంచామృతంతో అభిషేక పూజలు, పంచహారతులు, నివేదన, నీరాజనం, మంత్రపుష్పం పూజలతోపాటు కుంకుమపూజ, గణపతిహోమం నిర్వహించారు. ఈఓ సుదర్శన్ పాల్గొన్నారు.
మొదటి విడత తునికాకు
టెండర్లు ఖరారు
పాల్వంచరూరల్: తునికాకు సేకరణ టెండర్లు ఎట్టకేలకు ఖరారయ్యాయి. ఈ ఏడాది తునికాకు సేకరణ కోసం తెలంగాణ రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్ధ గురు, శుక్రవారాల్లో మొదటి దఫాలో పలు యూనిట్లకు టెండర్లు ఖరారు చేసింది. రెండో విడత ఈ నెల 10,11 తేదీల్లో, మూడో విడత 20,21వ తేదీల్లో టెండర్లు నిర్వహించనున్నారు. ఈ మేరకు సంస్థ డీఎం పృథ్వీరాజ్ వివరాలు వెల్లడించారు. జిల్లాలోని ఆరు డివిజన్ల పరిధిలో 39 యూనిట్లలో గతేడాది కూడా ఆలస్యంగా టెండర్లు నిర్వహించారు. 35,100 స్టాండర్డ్ బ్యాగుల తునికాకు సేకరణ లక్ష్యంగా నిర్దేశించగా, నాలుగో విడతలో పలువురు కాంట్రాక్టర్లు టెండర్లు ఖరారు చేసుకున్నారు. ఇక ఖమ్మం జిల్లాలోని ఐదు యూనిట్లు ఉండగా, ఒక్క యూనిట్‌పైనా కాంట్రాక్టర్లు ఆసక్తి చూపలేదు. దీంతో గతేడాది ఖమ్మం జిల్లాలో తునికాకు సేకరణ జరగలేదు.
స్వర్ణకవచధారణలో రామయ్య
Comments
Please login to add a commentAdd a comment