గని కార్మికులకు జడ్జి అభినందన
సింగరేణి(కొత్తగూడెం): సింగరేణి కార్మికులు వందల అడుగుల లోతులో పనిచేస్తూ, వేలాది పరిశ్రమలకు ఇంధనాన్ని అందిస్తున్నారని జిల్లా న్యాయసేవాధికారి సంస్థ కార్యదర్శి, న్యాయమూర్తి జి.భానుమతి పేర్కొన్నారు. అంకితభావంతో విధులు నిర్వర్తిస్తున్నారని అభినందించారు. సింగరేణి కొత్తగూడెం ఏరియా పరిధిలోని పీవీకే–5షాఫ్ట్ గనిని శుక్రవారం ఆమె సందర్శించారు. బొగ్గు గని కార్మికులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. బొగ్గు ఉత్పత్తి, రక్షణ చర్యలపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జడ్జి మాట్లాడుతూ కార్మికులు హక్కులు, చట్టాలపై అవగాహన పెంచుకోవాలన్నారు. డిప్యూటీ లీగల్ ఎయిడ్ కౌన్సిల్ నిరంజన్ రావు, సీనియర్ న్యాయవాది మెండు రాజమల్లు, సింగరేణి అధికారులు రవీందర్, శ్యాంప్రసాద్, షకీల్, హుమాయిన్, సీతారామ్, వి.కృష్ణవేణి, అనుపమ పాల్గొన్నారు.
పారా లీగల్ వలంటీర్ల బాధ్యత కీలకం
కొత్తగూడెంఅర్బన్: పారాలీగల్ వలంటీర్ల బాధ్యత కీలకమని జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ కార్యదర్శి జి.భానుమతి అన్నారు. శుక్రవారం వలంటీర్లతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో మాట్లాడారు. వృద్ధాశ్రమం, మానసిక వికాస కేంద్రాల్లో సమస్యలను గుర్తించి పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. నల్సా స్కీమ్‌ను సమర్థవంతంగా నిర్వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కౌన్సిల్ పి.నిరంజన్‌రావు, న్యాయవాదులు జి. రామచంద్రరెడ్డి, షాజహాన్ పర్వీన్, జి.సునంద, మెండు రాజమల్లు, పార్వతి, మహాలక్ష్మి, పారా లీగల్ వలంటీర్లు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment