ఉన్నత శిఖరాల వైపు పయనించాలి
దుమ్ముగూడెం : చదువుకుని గ్రామాల్లో ఉన్న యువత బయట ప్రపంచంలోకి వచ్చి, ఉన్నత శిఖరాల వైపు పయనించాలని ఎస్పీ రోహిత్ రాజు సూచించారు. ములకపాడు వైద్యశాల క్రీడా మైదానంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మండలస్థాయి వాలీబాల్ పోటీలను శుక్రవారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. వాలీబాల్ పోటీలకు 54 గ్రామాల నుంచి టీంలు రావడం అభినందనీయమని పేర్కొన్నారు. దుమ్ముగూడెం మండలంలో సుమారుగా రూ. 2 కోట్లతో స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని, గంజాయి, మద్యం మత్తులో వాహనాలు నడపొద్దని సూచించారు. ఆ తర్వాత పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న ఇండోర్ స్టేడియాన్ని పరిశీలించారు. స్టేడియంలో సదుపాయాలు కల్పించేందుకు కృషి చేస్తానని తెలిపారుర. ఈ కార్యక్రమంలో ఓఎస్డీ పరితోజ్ పంకజ్, భద్రాచలం ఏఎస్పీ విక్రాంత్‌కుమార్ సింగ్, 141 బెటాలియన్ సీఆర్పీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ రేవతి అర్జునన్, సీఐ అశోక్, ఎస్‌ఐలు వెంకటప్పయ్య, పోటు గణేష్ పాల్గొన్నారు.
వ్యాయామం అవసరం
భద్రాచలంటౌన్: యువత శారీరక దృఢత్వం కోసం రోజూ వ్యాయామం చేయాలని ఎస్పీ రోహిత్ రాజు అన్నారు. పట్టణంలోని టెంపుల్ రోడ్డులో నూతనంగా ఏర్పాటు చేసిన జిమ్‌ను ఆయన శుక్రవారం ప్రారంభించి మాట్లాడారు. సీఐ రమేష్, ఎస్‌ఐ మధు ప్రసాద్ పాల్గొన్నారు.
ఎస్పీ రోహిత్‌రాజు
Comments
Please login to add a commentAdd a comment