విద్యాశాఖపై అవినీతి మరకలు
పాల్వంచ: ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు వరుసగా అవినీతి నిరోధక శాఖకు చిక్కుతుండటం చర్చనీయాంశంగా మారుతోంది. విద్యాబుద్ధులు నేర్పే గురువులు లంచం తీసుకుంటూ విద్యార్థుల ఎదుటే అరైస్టె జైలుకు వెళ్తున్నారు. 2023 సెప్టెంబర్‌లో మధిర హెచ్‌ఎం మాతంగి శ్రీలత రూ.50 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కారు. మన ఊరు–మన బడి కార్యక్రమంలో చేపట్టిన పనులకు బిల్లులు చేసేందుకు డబ్బులు డిమాండ్ చేసి దొరికియారు. గత జనవరి 25న ఇల్లెందు ప్రభుత్వ మైనారిటీ కళాశాల ప్రిన్సిపాల్ బి.కృష్ణ, ఆఫీస్ అటెండర్ కొచ్చెర్ల రామకృష్ణ రూ.2 వేలు లంచం తీసుకుంటు పట్టుబడ్డారు. కళాశాల కాంట్రాక్ట్ అధ్యాపకులకు జీతాల బిల్లులు చేసేందుకు లంచం డిమాండ్ చేసి పట్టుబడ్డారు. తాజాగా కొత్తగూడెం కూలీలైన్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రవీందర్ ఏసీబీకి పట్టుబడ్డాడు. విద్యార్థులకు, సమాజానికి ఆదర్శంగా నిలవాల్సిన ఉపాధ్యాయులు లంచావతారం ఎత్తుతుండటంతో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇక హాస్టళ్లలో కూడా హెచ్‌ఎంలు, వార్డెన్లు, అధికారులు మామూళ్లకు అలవాటుపడ్డారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.
ప్రజల్లో చైతన్యం వస్తోంది
అవినీతి అధికారులను పట్టించేందుకు ప్రజలు ముందుకు వస్తున్నారు. ప్రజలు చైతన్యంతో ఏసీబీకి సమాచారం ఇవ్వడంతో వెంటనే రంగంలోకి దిగి పట్టుకుంటున్నాం. లంచం అడిగితే 1064 టోల్‌ఫ్రీ నంబర్‌కు, 9154388981 నంబర్‌కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలి. –వై.రమేష్, ఏసీబీ డీఎస్పీ
Comments
Please login to add a commentAdd a comment