వృత్తివిద్యపై దృష్టి సారించాలి
కలెక్టర్ జితేష్ వి.పాటిల్
పాల్వంచ: యువత వృత్తి విద్యా కోర్సులపై దృష్టి సారించాలని, మహిళలు ఆర్థిక స్వావలంబన దిశగా అడుగులు వేయాలని కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. నవలిమిటెడ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తన్న ఒకేషనల్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూషన్, మహిళా సాధికార కేంద్రాలను శుక్రవారం సందర్శించారు. శిక్షణ పూర్తి చేసుకున్న వారికి సర్టిఫికెట్లు అందించి మాట్లాడారు. వృత్తి విద్యా కోర్సులు నేర్చుకుని ఉన్నత స్థాయికి ఎదగాలని సూచించారు. నవలిమిటెడ్ అధికారులు ఎంజీఎం.ప్రసాద్, సంజీవరావు, ఖాదారేంద్ర బాబు, సాంబశివరావు, శ్రీనివాసరావు, యుఎస్‌ఎన్.శర్మ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment