పాల్వంచ: మోటార్ సైకిల్‌పై గంజాయి తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. పోలీసుల కథనం మేరకు.. పట్టణంలోని సంజయ్‌నగర్ వద్ద పోలీసులు వాహన తనిఖీలు చేపట్టగా.. బైక్‌పై ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించారు. తనికీ చేయగా వారి వద్ద రూ.3.90 లక్షల విలువ చేసే 7.8 కేజీల గంజాయి దొరికింది. పట్టుబడిన వ్యక్తులు సికింద్రాబాద్‌కు చెందిన అభిరామ్, చంద్రశేఖర్‌గా తేలగా.. వారు సీలేరు ప్రాంతం నుంచి హైదరాబాద్‌కు గంజాయి తరలిస్తూ పట్టుబడ్డారు. ఇద్దరిపై కేసు నమోదు చేశామని ఎస్‌ఐ రాఘవయ్య తెలిపారు. తనిఖీల్లో సిబ్బంది రమేశ్, రాజశేఖర్, వేణు, లక్ష్మణ్ పాల్గొన్నారు.
చోరీ నిందితుడి అరెస్ట్
జూలూరుపాడు: మాచినేనిపేటతండాకు చెందిన బానోత్ బాలు ఇంట్లో చోరీకి పాల్పడిన నిందితుడిని శుక్రవారం పోలీసులు అరెస్ట్ చేశారు. ఎస్‌ఐ బాదావత్ రవి కథనం ప్రకారం.. ఈ నెల 25వ తేదీ రాత్రి బాలు ఇంట్లోకి ఖమ్మం నగరం అగ్రహారం కాలనీకి చెందిన ఎస్కే నదీమ్‌పాషా ప్రవేశించి బంగారం, నగదు అపహరించాడు. శుక్రవారం స్థానిక ఉప మార్కెట్ యార్డు సమీపంలో వాహనాల తనిఖీ చేస్తుండగా పోలీసులను గమనించిన నదీమ్‌పాషా ఆటోతో పారిపోయే ప్రయత్నం చేశాడు. పోలీసులు వెంబడించి పట్టుకొని, విచారించగా తానే చోరీ చేసినట్లు అంగీకరించాడు. నిందితుడి వద్ద నుంచి రూ.5 వేలు నగదు స్వాధీనం చేసుకొని, అరెస్ట్ చేసి, రిమాండ్‌కు తరలించామని ఎస్‌ఐ రవి వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment