రామాలయానికి రూ.4 లక్షల విరాళం
అశ్వాపురం: మండలంలోని మొండికుంటలో నూతనంగా నిర్మించిన శ్రీ సీతారామ చంద్రస్వామి ఆలయంలో ఈ నెల 4 నుంచి విగ్రహ ప్రతిష్ఠాపన పూజలు మొదలుకానున్నాయి. ఈ సందర్భంగా ఆలయం మూలనిధికి గ్రామానికి చెందిన కందాల వెంకటరెడ్డి కుమార్తె ముద్దం చంద్రకళ–లచ్చిరెడ్డి దంపతులు శుక్రవారం రూ.4 లక్షల విరాళం అందజేశారు. గతంలోనూ ఈ దంపతులు రూ.6 లక్షలతో మకరతోరణం, శ్రీచక్రం, ఆకాశదీపాలు అందజేయడమే కాక ఆలయ ప్రాంగణానికి కావాల్సిన గ్రానైట్ రాయి సమకూర్చారు. ఈ సందర్భంగా చంద్రకళ – లచ్చిరెడ్డి కుటుంబీకులకు ఆలయ నిర్మాణ, ప్రతిష్ఠాపన కమిటీల బాధ్యులు కృతజ్ఞతలు తెలిపారు.
శాశ్వత నిత్యాన్నదానానికి విరాళం
భద్రాచలంటౌన్: భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామివారి దేవస్థానంలో జరిగే శాశ్వత నిత్యాన్నదాన కార్యక్రమానికి శుక్రవారం భక్తులు విరాళం అందజేశారు. ఖమ్మం శ్రీనివాసనగర్ కాలనీకి చెందిన ముసునూరి రామారావు – విజయకుమారి దంపతులు రూ.1,00,116 చెక్కును ఆలయ అధికారులకు అందజేశాక స్వామిని దర్శించుకున్నారు. ఆలయ ఉద్యోగి సాయిబాబు పాల్గొన్నారు.
టెన్నిస్ టోర్నీ సింగిల్స్ విజేత అధర్వశర్మ
ఖమ్మం స్పోర్ట్స్: ఖమ్మంలోని సర్దార్ పటేల్ స్టేడియంలో వారం రోజులుగా కొనసాగుతున్న టెన్నిస్ టోర్నీలో సింగిల్స్ విజేతగా
అధర్వశర్మ(మహారాష్ట్ర) నిలిచాడు. చల్లపల్లి రాధమ్మ స్మారక టోర్నీలో భాగంగా సింగిల్స్ విభాగంలో శుక్రవారం ఫైనల్స్ నిర్వహించా రు. ఇందులో అధర్వశర్మ, ఓగెస్ థేయ్జో జయప్రకాశ్(తమిళనాడు) తలపడగా 1–6, 6–3, 6–3 తేడాతో శర్మ టైటిల్ కై వసం చేసుకున్నాడు. ఈమేరకు విజేతతో పాటు రన్నరప్‌కు వీవీసీ గ్రూప్ చైర్మన్ వీ.వీ.రాజేంద్రసాద్, డీవైఎస్‌ఓ టి.సునీల్‌కుమార్‌రెడ్డితో పాటు చల్లపల్లి శ్రీనివాసరావు, డాక్టర్ కాసాని అనిల్, కాంపాటి సత్యనారాయణ, మద్దినేని వెంకట్ ట్రోఫీలు అందజేశారు. అలాగే, మొదటి నాలుగుస్థానాల్లో నిలిచిన క్రీడాకారులు, డబుల్స్ విజేతలు, రన్నరప్‌కు కలిపి మొత్తంగా రూ.2.50లక్షల నగదు బహుమతి అందజేసినట్లు నిర్వాహకులు తెలిపారు.
ఎఫ్‌బీఓపై దాడి..
ములకలపల్లి: ప్రభుత్వ విధులకు ఆటంకం కలిగించి, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ (ఎఫ్‌బీఓ)పై దాడికి పాల్పడిన వ్యక్తులపై కేసు నమోదైంది. ఎస్‌ఐ రాజశేఖర్ కథనం మేరకు.. పాల్వంచలోని నెహ్రూనగర్‌కు చెందిన తేజావత్ అనూష మండలంలోని ఒడ్డురామవరం ఎఫ్‌బీఓగా విధులు నిర్వహిస్తోంది. పూసుగూడెంనకు చెందిన భూక్యా నంద ఇంటి వద్ద టేకు కలప నిల్వ చేశారన్న సమాచారం మేరకు గురువారం సిబ్బందితో కలిసి దాడులు చేశారు. నందా భార్య సరిత, సోదరి సామిని ఎఫ్‌బీఓను అసభ్య పదజాలంతో దూషించడంతో పాటు దాడికి పాల్పడ్డారు. తనిఖీల పేరుతో మరోమారు ఇంటికి వస్తే చంపుతామని బెదిరించారు. ఈ ఘటనపై ఎఫ్‌బీఓ అనూష శుక్రవారం ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
దివ్యాంగుడి అదృశ్యం
పాల్వంచ: ఇంట్లో గొడవపడి దివ్యాంగుడు ఆరు రోజుల కిందట కనిపించకుండా వెళ్లిపోయాడు. పోలీసుల కథనం మేరకు.. పట్టణంలోని గాంధీనగర్‌కు చెందిన ఎన్.సామిత్ కుడికాలుకు పోలియో ఉంది. ఆరు రోజుల కిందట ఇంట్లోని సభ్యులతో గొడవ పడి వెళ్లిపోయాడు. అతని ఆచూకీ ఎక్కడా దొరక్క పోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మద్యం బాటిళ్లు స్వాధీనం
ఇల్లెందురూరల్: మండలంలోని రేపల్లెవాడ గ్రామ పంచాయతీ కట్టుగూడెం గ్రామానికి చెందిన సునీల్ ఇంట్లో అక్రమంగా నిల్వ ఉంచిన 21 మద్యం బాటిళ్లను ఎకై ్సజ్ అధికారులు శుక్రవారం స్వాధీనం చేసుకున్నారు. అనుమతి లేకుండా మద్యం బాటిళ్లను నిల్వ చేసి, విక్రయిస్తున్నట్లు సమాచారం అందడంతో తనిఖీలు చేపట్టారు. మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకుని సునీల్‌పై కేసు నమోదు చేసినట్లు ఎక్సైజ్ సీఐ రాంప్రసాద్ తెలిపారు.
రామాలయానికి రూ.4 లక్షల విరాళం
Comments
Please login to add a commentAdd a comment