ఎల్‌ఆర్‌ఎస్ లేకున్నా రిజిస్ట్రేషన్లకు ఓకే..
● రిజిస్ట్రేషన్‌తో పాటే ఎల్‌ఆర్‌ఎస్ ఫీజు చెల్లించేలా మార్గదర్శకాలు ● ఎన్నికల కోడ్ ముగియగానే అమలు
ఖమ్మంమయూరిసెంటర్: 2020 ఏడాదికి ముందు అనుమతి లేకుండా ఏర్పాటు చేసిన వెంచర్లలోని ప్లాట్ల రిజిస్ట్రేషన్‌కు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందుకోసం ఎల్‌ఆర్‌ఎస్ కింద 2020లో దరఖాస్తు చేసుకున్న ప్లాట్ల యజమానులు రిజిస్ట్రేషన్ సమయాన ఎల్‌ఆర్‌ఎస్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించి ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. అనుమతులు లేకుండా వేసిన వెంచర్లలో పది శాతం ప్లాట్లు రిజిస్ట్రేషన్ అయి ఉంటే లింక్ డాక్యుమెంట్లతో పని లేకుండానే రిజిస్ట్రేషన్ చేసేలా ఈ ఉత్తర్వుల్లో పొందుపరిచారు. అంతేకాక ఎల్‌ఆర్‌ఎస్ కోసం దరఖాస్తు చేసుకున్న ప్లాట్లకు సంబంధించి రిజిస్ట్రేషన్, ఫీజు వసూలు అంశాలపై ప్రభుత్వం ఉత్తర్వులతో పాటు ప్రత్యేక మాడ్యూల్ సైతం విడుదల చేసింది. ఫలితంగా ఉమ్మడి జిల్లాలోని 11 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల పరిధిలో 2020 ఏడాది కంటే ముందే వేసిన వెంచర్లల్లోని ప్లాట్లకు రిజిస్ట్రేషన్లు జరగనున్నాయి.
ఎన్నికల కోడ్ ముగియగానే..
ఉమ్మడి జిల్లా పరిధిలో ప్రస్తుతం ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. దీంతో ప్రభుత్వం ఎల్‌ఆర్‌ఎస్ ఫీజు రాయితీ ప్రకటించినా ఇంకా అమల్లోకి రాలేదు. కోడ్ ముగిశాక రాయితీ అమల్లోకి వస్తుందని, ఆపై 2020 ఏడాదికి ముందు వేసిన వెంచర్లలో ప్లాట్లు కొనుగోలు చేసిన వారు నేరుగా సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఫీజు చెల్లించి రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చని చెబుతున్నారు. తద్వారా రిజిస్ట్రేషన్ సంఖ్యతో పాటే ప్రభుత్వానికి ఆదాయం పెరగనుంది.
Comments
Please login to add a commentAdd a comment