విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టండి..
మణుగూరురూరల్: విద్యార్థుల పట్ల ఉపాధ్యాయులు ప్రత్యేక బాధ్యత తీసుకోవాలని భద్రాచలం ఐటీడీఏ పీఓ బి.రాహుల్ సూచించారు. శుక్రవారం మండలంలోని గుట్టమల్లారం గిరిజన సంక్షేమశాఖ ఇంగ్లిష్ మోడల్ పాఠశాలను, పగిడేరులోని ఎస్టీకాలనీలో గల జీపీఎస్‌ను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులతో బోర్డ్‌పై అక్షరమాల, అధికారుల పేర్లను రాయించారు. అక్షరాలు రాయడం, చదవడం, ఇంగ్లిష్ పదాలు పలకడంలో విద్యార్థులు వెనుకంజలో ఉన్నారని, ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఏటీడీఓ అశోక్‌కుమార్, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
వైద్యశిబిరం విజయవంతం
మణుగూరురూరల్: మండలంలోని పగిడేరు గ్రామంలో ఐటీడీఏ సహకారంతో జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన మెగా వైద్యశిబిరం విజయవంతమైంది. ఈ వైద్య శిబిరానికి మొత్తం 524 మంది హాజరు కాగా.. జనరల్ ఫిజీషియన్, ఎముకలు, చెవి, ముక్కు, గొంతు, పిల్లలు, కంటి, సీ్త్ర సంబంధిత వ్యాధి నిపుణులు ప్రజలకు వైద్యపరీక్షలు చేసి మందులు పంపిణీ చేశారు. పలువురికి రక్త పరీక్షలు, 52 మంది గర్భిణులకు స్కానింగ్, 83 మందికి కంటి పరీక్షలు చేయగా.. 46 మందికి ఎక్స్‌రే తీశారు. వైద్యశిబిరాన్ని భద్రాచలం ఐటీడీఏ పీఓ రాహుల్, డీఎంహెచ్‌ఓ భాస్కర్‌నాయక్ సందర్శించారు. కార్యక్రమంలో డీఐఓ బాలాజీనాయక్, మణుగూరు పీహెచ్‌సీ వైద్యుడు నిశాంత్‌రావు, వైద్యులు సాత్విక, సంజీవరావు, విజయ్, రాజశేఖర్, విక్టర్, ఖిల్లా, శైలేశ్, సిబ్బంది పాయం శ్రీనివాసరావు, వెంకటేశ్వర్లు, లింగ్యానాయక్, రాముడు, రవి, వెంకన్న, వాణి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment