సాగునీటిని సద్వినియోగం చేసుకోవాలి
చర్ల: రబీలో పంటలు సాగు చేసిన రైతులు తాలిపేరు ప్రాజెక్టు నీటిని సమన్వయంతో సక్రమంగా వినియోగించుకోవాలని తాలిపేరు మధ్య తరహా ప్రాజెక్టు ఈఈ రాంప్రసాద్ సూచించారు. ప్రాజెక్టు రెండో జోన్ పరిధిలోని పొలాలలకు సాగునీటిని విడుదల చేస్తుండగా చివరన గల పొలాలకు సాగునీరు అందకపోవడంపై రైతులు ప్రాజెక్టు అధికారులకు సమాచారం ఇచ్చారు. రెండో జోన్ పరధిలో లేనప్పటికీ కొన్ని చోట్ల పంటలు సాగు చేసిన రైతులు తాలిపేరు సాగునీటిని అక్రమంగా వినియోగిస్తున్నారని, తాము తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నామంటూ ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో తాలిపేరు ప్రాజెక్టు ఈఈ, డీఈ, ఏఈ, జేఈలు రైతులతో కలిసి అనధికారికంగా సాగునీటిని వినియోగిస్తున్న ప్రాంతాలను పరిశీలించారు. ప్రాజెక్టు అధికారులతో కలిసి ఆయకట్టు రైతులు తాలిపేరు ప్రాజెక్టును కూడా సందర్శించి నీటి నిల్వను, ఇన్‌ఫ్లోను పరిశీలించారు. నీటిని తోడేందుకు వినియోగిస్తున్న ఆయిల్ ఇంజన్లు, మోటార్లు, పైపులైన్లను వెంటనే తొలగించాలని సంబంధిత రైతులకు సూచించారు. ఈ సందర్భంగా ఈఈ రాంప్రసాద్ మాట్లాడుతూ.. తాలిపేరు ఎగువ ప్రాంతం నుంచి ప్రాజెక్టులోకి ఇన్‌ఫ్లో తగ్గిందని, ప్రస్తుతం ఉన్న నీటిని రైతులు పొదుపుగా వాడుకోవాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో డీఈ తిరుపతి, ఏఈలు ఉపేందర్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment